నెట్ బౌలర్ నుంచి.. ఐపీఎల్ వరకు... ఎవరీ కొత్త హీరో కార్తీక్ త్యాగి..!

By telugu news teamFirst Published Sep 22, 2021, 12:18 PM IST
Highlights

చివరి ఓవర్లో పంజాబ్ కింగ్స్‌ విజయానికి 4 పరుగులు అవసరం కాగా.. కార్తీక్ త్యాగి ఒక పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. 

ఐపీఎల్(ipl2021) సెకండ్ ఫేస్ ఆసక్తిగా సాగుతోంది. కాగా.. మంగళవారం పంజాబ్ కింగ్స్ (Punjab Kings), రాజస్థాన్ రాయల్స్ (Rajsthan Royals) జట్టు మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో విజయం చివరకు రాజస్థాన్ రాయల్స్ ని వరించింది. అయితే.. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించడానికి కారణం.. ఈ యువ క్రికెటర్ కార్తీక్ త్యాగి (kartik Tyagi) కావడం విశేషం.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ కార్తీక్ త్యాగి వయసు కేవలం 20 సంవత్సరాలు కావడం గమనార్హం. ప్రస్తుతం అతని చేతిలో కొన్నిఫస్ట్ క్లాస్, టీ20 మ్యాచ్ లు ఉన్నాయి. కాగా.. నిన్న జరిగిన మ్యాచ్ లో కార్తీక్ త్యాగి అదరగొట్టాడు. అతని ఆటకు అందరూ ఫిదా అయిపోయారు. హీరో, హీరో అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

చివరి ఓవర్లో పంజాబ్ కింగ్స్‌ విజయానికి 4 పరుగులు అవసరం కాగా.. కార్తీక్ త్యాగి ఒక పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో కచ్చితంగా తమదే గెలుపు అనుకున్న కింగ్స్‌కు నిరాశే ఎదురైంది. పంజాబ్‌ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్‌ (67; 43 బంతుల్లో 7×4, 2×6), కేఎల్ రాహుల్‌ (49; 33 బంతుల్లో 4×4, 2×6) రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంకు చేరుకుంది.

కాగా.. ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కార్తీక్ త్యాగిని  రూ.1.3కోట్లకు కొనుగోలు చేయడం గమనార్హం. కార్తీక్..  2020 అండర్-19 ప్రపంచకప్ జట్టులో పాల్గొన్నాడు. హాపూర్ లో జన్మించిన త్యాగి.. తన 17వ పుట్టిన రోజుకి ఒక నెల ముందు 2017-18 సీజన్ లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరపున అడుగుపెట్టాడు. అక్టోబర్ 2020లో టీమిండియా నుంచి  ఆస్ట్రేలియా పర్యటనలో ప్రయాణించడానికి ఎంచుకున్న నలుగురు నెట్ బౌలర్లలో త్యాగి పేరు కూడా ఉంది.

నిన్నటి ఐపీఎల్ మ్యాచ్ లో విజయం పంజాబ్ కింగ్స్ దే అని అందరూ అనుకున్నారు. కానీ.. కార్తీక్ మ్యాజిక్ చేశాడు. చివరి ఓవర్లో పంజాబ్ కింగ్స్‌ విజయానికి 4 పరుగులు అవసరం కాగా.. కార్తీక్ త్యాగి ఒక పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో.. విజయం రాజస్థాన్ రాయల్స్ ని వరించింది. ఈ విజయాన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా ఊహించలేదు. దీంతో.. ఈ విజయానికి కారణమైన కార్తీక్ త్యాగిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 

click me!