పంజాబ్ కింగ్స్ జట్టులో క్రిస్ గేల్ కి దక్కని చోటు.. షాకైన సునీల్ గవాస్కర్

By telugu news teamFirst Published Sep 22, 2021, 10:27 AM IST
Highlights

గేల్ ఆడడం లేదన్న విషయం తెలిసిన గవాస్కర్, కెవిన్ పీటర్సన్ షాకయ్యారు. విండీస్ దిగ్గజానికి బదులు దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కరమ్‌కే పంజాబ్ యాజమాన్యం ప్రాధాన్యం ఇచ్చింది.

ఐపీఎల్ సేకండ్ ఫేజ్ మ్యాచ్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. కాగా.. ఈ ఐపీఎల్(IPL) లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో పంజాబ్ కింగ్స్ జట్టు మంగళవారం తలపడిన సంగతి తెలిసిందే. అయితే..  ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్(chris gayle) కి చోటు దక్కలేదు. క్రిస్ గేల్ కి చోటు దక్కకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్(sunil gavaskar) ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నిన్న బర్త్ డే జరుపుకుంటున్న గేల్‌‌కు చోటు లభించకపోవడంతో ఆభిమానులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. టాస్ సమయంలోనే గేల్ ఆడడం లేదని కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పష్టం చేశాడు.

గేల్ ఆడడం లేదన్న విషయం తెలిసిన గవాస్కర్, కెవిన్ పీటర్సన్ షాకయ్యారు. విండీస్ దిగ్గజానికి బదులు దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కరమ్‌కే పంజాబ్ యాజమాన్యం ప్రాధాన్యం ఇచ్చింది. మార్కరమ్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నాడు. అతడితోపాటు విదేశీ ఆటగాళ్లు నికోలస్ పూరన్, ఫాబియన్ అలెన్, అదిల్ రషీద్‌లకు తుది జట్టులో స్థానం కల్పించారు. 

క్రిస్‌గేల్ ఆడడం లేదన్న విషయం తెలిసి ఆశ్చర్యపోయానని గవాస్కర్ పేర్కొన్నాడు. అది కూడా అతడి బర్త్‌డే నాడు ఇలా జరగడం మరింత షాక్‌కు గురిచేసిందన్నాడు. గేల్ ప్రతీ లీగ్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శిస్తాడని, బర్త్ డే నాడే అతడిని పక్కనపెట్టారంటే సెన్స్ లేదనే అనుకోవాలని అన్నాడు. టాస్‌కు ముందు గేల్‌ను ఇంటర్వ్యూ చేసిన పీటర్స్ కూడా పుట్టిన రోజు నాడు యూనివర్స్ బాస్‌ను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదని అన్నాడు. ఈ విషయంలో తమకంటే గేల్‌ ఎక్కువ నిరాశ చెంది ఉంటాడని పేర్కొన్నాడు. కాగా, పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో పంజాబ్‌కు ప్రతీ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా ఆరో స్థానంలో ఉన్న రాజస్థాన్‌పై గెలవడం ఇంకా ముఖ్యం. ఈ నేపథ్యంలో గేల్‌ను పక్కనపెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 

click me!