ఏం ఫీల్డిండ్ గురూ.. 36 ఏండ్ల వ‌య‌స్సులోనూ అద‌ర‌గొట్టిన కీర‌న్ పొలార్డ్ !

By Mahesh Rajamoni  |  First Published Feb 25, 2024, 8:39 PM IST

Kieron Pollard: ఐపీఎల్ కు గుడ్ చెప్పిన‌ప్ప‌టికీ ప‌లు క్రికెట్ లీగ్ ల‌లో ఆడుతూ అద‌ర‌గొడుతున్నాడు ముంబై ఇండియాన్స్ మాజీ స్టార్ కీర‌న్ పొలార్డ్. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడుతున్న పొలార్డ్ అద్భుత‌మైన ఫీల్డింగ్ తో ప‌ట్టుకున్న క్యాచ్ వీడియో వైర‌ల్ అవుతోంది.  
 


Kieron Pollard Stunning Boundary Catch: వెస్టిండీస్ సంచ‌ల‌నం కీర‌న్ పొలార్డ్ ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 2022లో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) నుంచి కూడా త‌ప్పుకుంటున్న‌ట్టు పొలార్డ్ ప్ర‌క‌టించాడు. అయితే, ప‌లు క్రికెట్ లీగ్ ల‌లో ఆడుతూ ఇప్ప‌టికీ క్రికెట్ లో త‌న‌దైన ఆట‌తో రాణిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే త‌న అద్భుత‌మైన ఫీల్డింగ్ నైపుణ్యంలో అందుకున్న ఒక సూప‌ర్ క్యాచ్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఐపీఎల్ లో అత‌ను ఆడిన ఆట‌ను మ‌రోసారి గుర్తు చేసేలా క్యాచ్ ప‌ట్టాడు.

కీర‌న్ పొలార్డ్ ప్ర‌స్తుతం పాకిస్తార్ క్రికెట్ లీగ్ లో ఆడుతున్నారు. కరాచీ కింగ్స్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన కీర‌న్ పొలార్డ్ లాహోర్ క్వాలండర్స్‌తో జ‌రిగిన మ్యాచ్ లో అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్టి అద‌ర‌గొట్టాడు. అభిమానులను, క్రికెట్ ప్రియుల‌ను, గ్రౌండ్ లోని ప్రేక్షకులను ఉర్రూత‌లుగించాడు. 36 ఏళ్ళ పొలార్డ్ అద్బుత‌మైన క్యాచ్ తో పాటు ధ‌నాధ‌న్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ తో  లాహోర్ క్వాలండర్స్‌పై 2 వికెట్ల తేడాతో క‌రాచీ కింగ్స్ విజయం సాధించింది.

Latest Videos

లాహోర్ ఇన్నింగ్స్ లో  12.2 ఓవర్లలో 90/3 వద్ద ఖలందర్స్‌కు చెందిన జహందాద్ ఖాన్ లాంగ్-ఆన్ వైపు షాట్ కొట్టాడు, సిక్స్ వెళ్లేలా క‌నిపించింది. అయితే, అద్భుత‌మైన ఫీల్డింగ్ తో పొలార్డ్ గాల్లోకి ఎగిరి క్యాచ్ ప‌ట్టాడు. బౌండ‌రీ లైన్ అవ‌త‌లికి దూకే ప‌రిస్థితి ఉండ‌టంతో మ‌ళ్లీ బంతిని గాల్లోకి విసిరి బౌండ‌రీ లైన్ దాటి గ్రౌండ్ లోకి వ‌చ్చి బాల్ ను ప‌ట్టుకున్నాడు. క్ష‌ణాల్లో ఇవ‌న్ని జ‌రిగిపోయిన ఈ క్యాచ్ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఐపీఎల్ ఆడుతున్న స‌మ‌యంలో తొమ్మిదేళ్ల క్రితం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో పొలార్డ్ ఇలాంటి క్యాచ్  ప‌ట్టి అద‌ర‌గొట్టాడు. ఇప్పుడు మ‌ళ్లీ అదే త‌ర‌హా క్యాచ్ అందుకోవ‌డంతో కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది.

 

"You shall not pass!" 🧙‍♂️

Pollard pulls off a 𝒎𝒂𝒈𝒊𝒄𝒂𝒍 catch ✨ pic.twitter.com/mpu2FGGg7o

— PakistanSuperLeague (@thePSLt20)
click me!