IND vs ENG : ఏ భాయ్.. హీరో అవుదామ‌నుకుంటున్నావా? స‌ర్ఫ‌రాజ్ కు రోహిత్ క్లాస్.. !

By Mahesh RajamoniFirst Published Feb 25, 2024, 6:46 PM IST
Highlights

India vs England: రాంచీ వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ 4వ టెస్టు మ్యాచ్ లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ కు రోహిత్ శ‌ర్మ క్లాస్ పీకాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ ఘ‌ట‌న భార‌త్ ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో జ‌రిగింది.

India vs England: భార‌త్-ఇంగ్లాండ్ 4 టెస్టు మ్యాచ్ లో టీమిండియా విజ‌యం దిశ‌గా ముందుకు సాగుతోంది. మూడో రోజును భార‌త్ అద్భుతంగా ముగించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో రాణించి మ‌రో విజ‌యాన్ని అందుకోవ‌డానికి సిద్ధంగా ఉంది. అయితే, మూడో రోజు ఆట‌లో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌-స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ల‌కు సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అందులో త‌న‌దైన స్టైల్లో స‌ర్ఫ‌రాజ్ కు రోహిత్ శ‌ర్మ వార్నింగ్ ఇచ్చాడు.

వార్నింగ్ అని కాదు కానీ, ఏం త‌మ్మీ హీరో అవుదామ‌నుకుంటున్నావా అంటూ ఆట‌గాళ్ల భ‌ద్ర‌త‌ను ప్ర‌స్తావిస్తూ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.  3వ రోజు చివరి సెషన్‌లో, సిల్లీ పాయింట్‌లో ఫీల్డిండ్ చేయ‌డానికి స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ను రోహిత్ శ‌ర్మ పిలిచాడు. ఈ పాయింట్ లో ఎవ‌రైనా హెల్మెట్ ధ‌రించాల్సిందే..  అయితే, స‌ర్ఫ‌రాజ్ స్టైల్‌గా హెల్మెట్‌ లేకుండా వచ్చి నిలబడటాన్ని చూసిన రోహిత్ శ‌ర్మ‌.. ఏం భాయ్ హీరో అవుదామ‌నుకుంటున్నావా.. అంటూ వార్నింగ్ ఇవ్వ‌డంతో పాటు ఇక్క‌డ అలాంటిది కుద‌ర‌దు.. హెల్మెట్ పెట్టుకో అని కంటిచూపుతోనే చెబుతున్న‌ట్టుగా ఒక్క చూపు చూశాడు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Latest Videos

 

Hero nahi banne ka.. Rohit Sharma scolds Sarfaraz Khan in Ranchi Test
📸JioCinema pic.twitter.com/dCQJz79Nc3

— mahe (@mahe950)

ఇదిలావుండ‌గా, 4వ టెస్టు 3వ రోజు భార‌త్ అద్భుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించింది. రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మొత్తం 10 వికెట్లు తీయడంతో స్పిన్నర్ల జోరు క‌నిపించింది. షోయబ్ బషీర్ 5 వికెట్లు తీసుకున్నాడు. ధృవ్ జురెల్ తన 2వ టెస్టు మ్యాచ్‌లో 90 పరుగులతో భారత్‌ను క‌ష్టాల నుంచి బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చాడు. జురెల్ కుల్దీప్ యాదవ్‌తో కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. అలాగే, అరంగేట్రం ఆటగాడు ఆకాష్ దీప్‌తో కలిసి 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ 307 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. 

రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ భార‌త బౌల‌ర్లు చెడుగుడు ఆడుకున్నారు. దీంతో ఇంగ్లాండ్ 145 పరుగులకే కుప్ప‌కూలింది. భార‌త్ ముందు 192 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భార‌త్ రెండో ఇన్నింగ్స్ ను దూకుడుగా ప్రారంభించింది. మూడో రోజు ఆట ముగిసే స‌మాయానికి భారత్ 40 ప‌రుగులు చేయ‌గా, కెప్టెర్ రోహిత్ శ‌ర్మ 24 ప‌రుగులు, య‌శ‌స్వి జైస్వాల్ 16 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. భార‌త్ గెలుపున‌కు ఇంకా 152 ప‌రుగులు కావాలి.

click me!