సౌర‌వ్ గంగూలీని బీట్ చేసిన రోహిత్ శ‌ర్మ.. !

By Mahesh Rajamoni  |  First Published Jan 26, 2024, 8:32 PM IST

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ.. భార‌త్-ఇంగ్లాండ్ తొలి టెస్టులో మ‌రో ఘ‌న‌త సాధించాడు. భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీని బీట్ చేశాడు. రోహిత్ శ‌ర్మ భార‌త్ త‌ర‌ఫున ఇప్ప‌టివ‌ర‌కు 468 మ్యాచ్ ల‌ను ఆడి 18,444 ప‌రుగులు సాధించాడు. 
 


Rohit Sharma beats Sourav Ganguly: టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ భార‌త దిగ్గ‌జ ప్లేయ‌ర్ ను బీట్ చేసి ప్ర‌త్యేక క్ల‌బ్ లో చేరాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. హైదరాబాద్ లోని ఉప్ప‌ల్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న టెస్టు తొలి రోజు మూడో సెషన్ లో రోహిత్ శర్మకు బ్యాటింగ్  వ‌చ్చి.. 27 బంతుల్లో 24 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ తో కలిసి రోహిత్ తొలి వికెట్ కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రోహిత్ శ‌ర్మ త‌న ఈ ఇన్నింగ్స్ తో భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్ మ‌న్ గా రికార్డు సృష్టించాడు.

ఈ మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ భార‌త దిగ్గ‌జ ప్లేయ‌ర్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని అధిగమించాడు. ఇప్ప‌టివ‌ర‌కు రోహిత్ శర్మ భార‌త్ త‌ర‌ఫున 468 మ్యాచ్ ల‌ను ఆడి 18,444 పరుగులు చేశాడు. టీమిండియా మాజీ సార‌థి సౌరవ్ గంగూలీ 421 మ్యాచ్ ల‌లో 18,433 పరుగులు చేశాడు. అయితే, భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన రికార్డు క్రికెట్ గాడ్, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. టెండూల్క‌ర్ త‌న కెరీర్ లో 664 మ్యాచ్ లు ఆడి 34,357 పరుగులు చేశాడు. ఇందులో 100 సెంచరీలు, 164 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. 522 మ్యాచ్ ల‌లో 26,733 పరుగులు చేశాడు. కోహ్లీ 80 సెంచరీలు, 139 హాఫ్ సెంచరీలు కొట్టాడు.

Latest Videos

undefined

ఇంగ్లాండ్ పై ర‌వీంద్ర జ‌డేజా టాప్ క్లాస్ షో.. ఆల్‌రౌండర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో రెచ్చిపోయిన జ‌డ్డూ !

అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్లు

1. సచిన్ టెండూల్కర్ - 664 మ్యాచ్ లు - 34,357  పరుగులు 
2. విరాట్ కోహ్లీ -  522* మ్యాచ్ లు - 26,733  పరుగులు
3. రాహుల్ ద్రవిడ్ - 504 మ్యాచ్ లు - 24,064  పరుగులు 
4. రోహిత్ శర్మ - 468* మ్యాచ్ లు - 18,444 ప‌రుగులు 
5. సౌరవ్ గంగూలీ - 421 మ్యాచ్ లు - 18,433  పరుగులు

147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచ‌రీ.. త‌న్మ‌య్ అగ‌ర్వాల్ ప్ర‌పంచ రికార్డు..

click me!