ఫాంహౌస్‌లో ధోనీ రిపబ్లిక్ డే వేడుకలు .. త్రివర్ణ పతాకంతో మహేంద్రుడు, వీడియో చూశారా

By Siva Kodati  |  First Published Jan 26, 2024, 9:01 PM IST

75వ గణతంత్ర వేడుకలను భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రాంచీలోని తన ఫాంహౌస్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి దేశ భక్తిని చాటుకున్నారు. 


75వ గణతంత్ర వేడుకలను భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అతిరథ మహారథుల మధ్య వేడుకలు జరిగాయి. ఈసారి నారీశక్తి పేరుతో త్రివిధ దళాలు చేపట్టిన కవాతు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పలువురు సెలబ్రెటీలు కూడా రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించాయి. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రాంచీలోని తన ఫాంహౌస్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి దేశ భక్తిని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ధోనీ భార్య సాక్షి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో ధోనీ.. భారీ జెండాను చూస్తూ నిల్చొన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. 

ఇకపోతే.. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024)లో ధోనీ మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. ఈ సీజన్ తర్వాత ధోనీ భవిష్యత్తు ఏంటనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. అతని కెరీర్‌లో చివరి ఐపీఎల్ ఎడిషన్ ఏది అనేది ధోనీ మాత్రమే చెప్పగలడని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ని ఉటంకిస్తూ చెప్పాడు. 

Latest Videos

undefined

ఈ ఏడాది జూన్‌లో ధోనీ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం ఆయన కఠోర సాధన చేస్తున్నాడు. 2024 ఐపీఎల్‌లో పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలో దిగాలని ధోనీ భావిస్తున్నారు. బహుశా మరో 10 రోజుల్లో ధోనీ నెట్ ప్రాక్టీస్ కూడా మొదలుపెడతాడని విశ్వనాథన్ చెప్పారు. 
 

click me!