IPL 2021: నీ అల్లుడు, బావా! వాడు..: కొడుకు ఫోటో షేర్ చేసిన బ్రావో.. డీజే, పొలార్డ్ మధ్య ఆసక్తికర పోస్టు

Published : Oct 04, 2021, 02:47 PM ISTUpdated : Oct 04, 2021, 02:51 PM IST
IPL 2021: నీ అల్లుడు, బావా! వాడు..: కొడుకు ఫోటో షేర్ చేసిన బ్రావో.. డీజే, పొలార్డ్ మధ్య ఆసక్తికర పోస్టు

సారాంశం

DJ Bravo and Pollard: కరేబియన్ క్రికెట్ స్టార్స్ గా గుర్తింపు పొందిన డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్ ల మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. బ్రావో కొడుకు బర్త్ డే ఇందుకు వేదికైంది. 

వెస్టిండీస్ లో టెస్టు, వన్డే క్రికెట్ కు పెద్దగా ఆదరణ కరువైనా టీ20 కి మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంది. దీంతో ధనాదన్ ఆటలో కరేబియన్ జట్టును ఢీకొట్టడమంటే అన్ని జట్లు ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉంటాయి. ఇక ఆ జట్టు విధ్వంసకర ఆటగాళ్లు డీజే బ్రావో, కీరన్ పొలార్డ్ లు విజృంభిస్తే మాత్రం ప్రత్యర్థి జట్టుకు ఆరోజు పట్టపగలే చుక్కలు కనబడుతాయి. ఐపీఎల్ లో రెండు అగ్రశ్రేణి జట్లైన చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బ్రావో ఆడుతుంటే.. ముంబయి ఇండియన్స్ తరఫున పొలార్డ్ ఆడుతున్నాడు. ఈ ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో చేసిన సరదా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

 


తన కొడుకు బర్త్ డే సందర్భంగా బ్రావో.. ఆ బాలుడి ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఇవాళ నీ రోజు. నా కొడుకు జూనియర్ బ్రావోకు పుట్టినరోజు శుభాకాంక్షలు. లవ్ యూ..’ అని ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చాడు. 

దీనికి పొలార్డ్ స్పందిస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే యంగ్ బ్రావో’ అని కామెంట్ పెట్టాడు. అయితే  పొలార్డ్ కామెంట్ కు బ్రావో రిప్లై ఇస్తూ.. ‘నీ అల్లుడు’ అంటూ స్పందించాడు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో తెగ వైరలవుతున్నది. ఐపీఎల్ లో రెండు వేర్వేరు జట్లకు ఆడుతున్నా.. ఈ ఇద్దరు విండీస్ వీరులు మాత్రం చాలా క్లోజ్ గా ఉంటారు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?