Pandora Papers Leak: పండోరా పేపర్స్ లో క్రికెట్ దేవుడి పేరు.. సచిన్ ఆస్తులపై సోషల్ మీడియాలో రచ్చ..

By team teluguFirst Published Oct 4, 2021, 1:36 PM IST
Highlights

Sachin Name In Pandora: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పండోరా పేపర్ల లీక్ లో భారతీయ క్రీడా ప్రముఖులు కూడా ఉన్నారని తెలియగానే క్రీడా ప్రపంచం అవాక్కయ్యింది. ముఖ్యంగా భారత్ లో క్రికెట్ దేవుడుగా భావించే సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పేరు కూడా ఈ పత్రాల్లో లీక్ (pandora leaks) అవ్వడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. 

పండోరా పేపర్లు (pandora papers leak) ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు చేస్తూ ఆదివారం వెలువడిన ఈ సంచలనాత్మక కథనాల్లో సుమారు 380 మంది భారతీయుల పేర్లు కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ (ఐసీఐజే) ఈ పేపర్లను విడుదల చేసింది. పనోమా పేపర్ల లీక్ (panoma papers leak) ను మించిన ఈ  పత్రాల జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరు ఉండటంతో క్రీడాలోకం నివ్వెరపోయింది. 

తన కెరీర్ లో వివాదాలకు దూరంగా ఉన్న టెండూల్కర్.. పండోరా పేపర్ల లీక్ తో ఇబ్బందుల్లో పడ్డాడు. సచిన్ తో పాటు అతడి భార్య అంజలి టెండూల్కర్, మామ ఆనంద్ మెహతా పేర్లు వెలుగులోకి వచ్చాయి. పనామా పత్రాలు లీకైన మూడు నెలల తర్వాత బ్రిటిష్ వర్జిన్ దీవుల్లోని సాస్ ఇంటర్నేషనల్ లో సచిన్ తన వాటాలను రద్దు చేసుకున్నట్టు పండోరా ప్రకటించింది. 

సొంత దేశాన్ని కాదని పన్ను తక్కువ ఉన్న విదేశాలకు సంపదను తరలించడం.. వాటి విలువను లెక్కలోకి చూపకపోవడం వంటి ఆరోపణలతో పండోరా పేపర్ల లీక్ కథనం వెలువడిన విషయం తెలిసిందే. అయితే పనామా పత్రాలు మూడు నెలలకే సచిన్.. బ్రిటిష్ వర్జిన్ దీవుల్లోని సంస్థను మూసివేశారని పండోరా బయటపెట్టడం కలకలం సృష్టించింది.
2016 లో దీనిని విక్రయించిన సమయంలో సచిన్, అంజలి, ఆనంద్ మెహతా కొన్ని షేర్లు తీసుకున్నారని ఆరోపణలున్నాయి. 2012 నుంచి 2018 దాకా రాజ్యసభ ఎంపీ (కాంగ్రెస్ తరఫున) ఎంపీగా ఉన్న సచిన్.. తన ఆస్తుల వివరాలను వెల్లడించలేదు. రాజ్యసభకు నామినేట్ అయినవారు ఇతరుల వలే ఆస్తుల వివరాలను బహిష్కరించాల్సిన అవసరం లేదు. 

ఇదిలాఉండగా.. పండోరా పేపర్ల లీక్ అనంతరం సచిన్ తరఫు న్యాయవాది స్పందిస్తూ..  ఆయన పెట్టుబడులన్నీ చట్టబద్ధమైనవేనని చెప్పుకొచ్చారు. భారత్ లో పన్ను చెల్లింపు సంస్థలకు అన్ని వివరాలను అందజేశామని వివరణ ఇచ్చారు. ఏదెలా ఉన్నా సచిన్ కూడా తన పారదర్శకతను నిరూపించుకోవాల్సిన అవసరముందని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదిలాఉండగా మరికొద్దిరోజుల్లో ఆ జాబితాలో ఉన్నవారి పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నది. 

click me!