కాబోయే భార్యతో చాహల్ క్యూట్ ఫోటో.. నెట్టింట వైరల్

By telugu news teamFirst Published Aug 14, 2020, 9:57 AM IST
Highlights

లాక్​డౌన్ సమయంలో జూమ్​ వర్క్​షాప్​ల్లో  చాహల్​ – ధనశ్రీకి పరిచయం ఏర్పడినట్టు సమాచారం. అలాగే తాను కొరియోగ్రాఫర్​, యూట్యూబర్​, ధనశ్రీ వర్మ సంస్థకు ఫౌండర్​ని అని ధనశ్రీ ఇన్​స్టాగ్రామ్​ అధికారిక ఖాతాలో పేర్కొన్నారు. 

టీమ్​ఇండియా స్టార్​ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ నిశ్చితార్థం పూర్తయింది. ధనశ్రీ వర్మను చాహల్ వివాహం చేసుకోనున్నాడు. ఇరు కుటుంబాల సమక్షంలో ఇటీవల నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ విషయాన్ని చాహల్​ ట్విట్టర్​లో వెల్లడించాడు. కాబోయే భార్య ధనశ్రీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. 

ధనశ్రీ వర్మ డాక్టర్​గా పనిచేస్తున్నారు. లాక్​డౌన్ సమయంలో జూమ్​ వర్క్​షాప్​ల్లో  చాహల్​ – ధనశ్రీకి పరిచయం ఏర్పడినట్టు సమాచారం. అలాగే తాను కొరియోగ్రాఫర్​, యూట్యూబర్​, ధనశ్రీ వర్మ సంస్థకు ఫౌండర్​ని అని ధనశ్రీ ఇన్​స్టాగ్రామ్​ అధికారిక ఖాతాలో పేర్కొన్నారు. 

కాగా.. తాజాగా చాహల్..తన ఇన్ స్టాగ్రామ్ లో మరో ఫోటో షేర్ చేశాడు. తనకు కాబోయే భార్యతో కలిసి దిగిన ఆ ఫోటో చాలా క్యూట్ గా ఉంది. అందులో చాహల్ తన చేతితో హార్ట్ సింబల్ చూపిస్తుండగా.. ధనశ్రీ.. అందంగా నవ్వుతూ కూర్చొని ఉంది. కాగా.. దానికి చాహల్ పెట్టిన క్యాప్షన్ కూడా అదిరింది. ‘‘మేము ఈ ప్రేమను ఫోటోల్లో బంధిస్తున్నాం’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. వీరి ఫోటో ఇప్పుడు నెట్టింట అభిమాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

We keep this love in a photograph 📸 🌹

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) on Aug 13, 2020 at 3:51am PDT

 

ఇదిలా ఉండగా.. ధనశ్రీ పాపులర్ యూట్యూబ్ స్టార్ కావడం గమనార్హం. ధనశ్రీకి డాన్స్‌ అన్నా, కొరియోగ్రఫీ అన్నా చెప్పలేనంత ఇష్టం. బాలీవుడ్‌, హిప్‌-హాప్‌ పాటలకు అదరగొట్టే స్టెప్పులతో ధనశ్రీ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అందంతో పాటు తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆమె కొద్దిరోజుల్లోనే యూట్యూబ్‌లో సెలబ్రిటీ అయ్యారు. ఆమె డాన్స్‌ వీడియోలకు కోట్లలో అభిమానులున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య అయిదు లక్షలపైనే. కొరియోగ్రఫీ మీద ఇష్టంతో సొంతంగా తన పేరుతో ‘ధనశ్రీ వర్మ కంపెనీ’ ప్రారంభించారు. ఫిట్‌నెస్‌, బాలీవుడ్‌ సాంగ్స్‌, హిప్‌-హాప్‌, వెడ్డింగ్‌ కొరియోగ్రఫీలో శిక్షణతో పాటు వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తున్నారు. 


కాగా యూఏఈలో జరిగే ఐపీఎల్ కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని చాహల్ ఇటీవలే చెప్పాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ సెప్టెంబర్ 19వ తేదీ నుంచి యూఏఈలో జరుగనున్న సంగతి తెలిసిందే.

click me!