ధోనీకి వారసురాలు.. హెలికాప్టర్ షార్ట్స్ కుమ్మేస్తున్న చిన్నారి

By telugu news teamFirst Published Aug 14, 2020, 8:37 AM IST
Highlights

అంత చిన్న వయస్సులోనే అద్భుతమైన ఫుట్ వర్క్‌తో పరీ బ్యాటింగ్ చేస్తున్న తీరు వాళ్లని మంత్రముగ్ధుల్ని చేసింది. 

ఆ చిన్నారి వయసు ఏడేళ్లు. పేరు పరీ శర్మ. భారత్ కి చెందిన ఆ చిన్నారి బ్యాట్ పట్టిందంటే.. మహామహులైనా ఆశ్చర్యపోవాల్సిందే. అంతలా ఆకట్టుకునేలా బ్యాటింగ్ చేయడం ఆ చిన్నారి టాలెంట్. తాజాగా.. ఆ చిన్నారి క్రికెట్ ఆడుతున్న వీడియో పోస్టు చేయగా.. పలువురు ఫిదా అయ్యారు. వారిలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ షాయ్ హోప్ లు కూడా ఉన్నారు.

అంత చిన్న వయస్సులోనే అద్భుతమైన ఫుట్ వర్క్‌తో పరీ బ్యాటింగ్ చేస్తున్న తీరు వాళ్లని మంత్రముగ్ధుల్ని చేసింది. పరీ బ్యాటింగ్ చేస్తున్న వీడియోని మైఖేల్ వాన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

‘‘ఈ వీడియోని ఒకసారి చూడండి. 7 సంవత్సరాల పరీ శర్మ.. ఆట బ్యాటింగ్ చేస్తున్న తీరు ఎంతో అద్భుతంగా ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఇక వెస్టిండీస్ ఆటగాడు షాయ్ హోప్ కూడా పరీ వీడియోని షేర్ చేసి.. ‘‘నేను ఎదిగాక.. పరీ శర్మలా ఆడుతాను’’ అని క్యాప్షన్ పెట్టాడు. 

తాజాగా.. ఈ చిన్నారి వీడియో చూసిన టీమిండియా మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, సంజయ్ మంజ్రేకర్ లు ఆమెకు అభిమానులుగా మారిపోయారు. ఆకాశ్ చోప్రా అయితే.. హిందీలో తన కామెంటరీ  జోడించడం గమనార్హం. ‘ అగ్గిపిడుగు.. ఆమె మన పరీ శర్మ. అత్యంత ప్రతిభావంతురాలు కదా’ అని ట్వీట్ చేశారు. దీనికి అందరూ మంజ్రేకర్ స్పందించారు.

‘ అందరూ హెలికాప్టర్ షాట్ ను సాధన చేయడం ప్రస్తుతం నేను చూస్తున్నా. వికెట్లకు అత్యంత సమీపంలో ఉండి బంతిని అందుకోవడంతోపాటు అంతర్జాతీయంగా ధోనీ ప్రాముఖ్యం తీసుకొచ్చిన మరో టెక్నిక్ ఇది. ఎదుగుతున్న క్రికెటర్లకు ఇదో గొప్ప షాట్’ అని మంజ్రేకర్ పేర్కొన్నారు. కాగా.. నెటిజన్లు సైతం ధోనీకి వారసురాలు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

కాగా, టీం ఇండియా మహిళ జట్టు ప్లేయర్ శిఖా పాండే కూడా ఈ వీడియోపై స్పందించింది. పరీ ఎక్కడ ఉన్నా.. తనని కలుసుకొని.. ఆమె నుంచి శిక్షణ పొందాలని తనకు ఉందని శిఖా పేర్కొంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అంత చిన్న వయస్సులోనే పరీ.. టైమింగ్, ఫుట్‌వర్క్, నేర్పుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు

click me!