IPL 2024: ఆరంభం నుంచి మాకు మంచి ఊపులేదు.. ముంబై స్టార్ ప్లేయ‌ర్ షాకింగ్ కామెంట్స్

By Mahesh Rajamoni  |  First Published May 14, 2024, 7:44 PM IST

Mumbai Indians : ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియ‌న్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024 సీజ‌న్ లో దారుణ ప్ర‌ద‌ర్శ‌న‌లో అన్ని జ‌ట్ల కంటే ముందుగానే ప్లేఆఫ్ రేసు నుంచి ఔట్ అయింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌పై ముంబై ప్లేయ‌ర్  చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.
 


Mumbai Indians : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 హార్దిక్ పాండ్యా నాయ‌క‌త్వంలోని ముంబై ఇండియ‌న్స్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న‌తో నిరాశ‌ప‌రించింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ముంబై ఇండియ‌న్స్ స్టార్ ప్లేయ‌ర్ పియూస్ చావ్లా జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న‌పై చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారియి. ఈ సీజ‌న్ లో త‌మ జ‌ట్టు మొద‌టి నుంచి టీ20 క్రికెట్ ఊపును అందుకోలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ 2024 60వ మ్యాచ్ లో  కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత ముంబై ఇండియన్స్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా మాట్లాడుతూ ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై టీమ్ కు ఆరంభం నుంచి ఆశించిన ఊపు రాలేదని అన్నాడు.

ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఐపీఎల్ 2024 మ్యాచ్ లో కేకేఆర్ స్పిన్నర్ల అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ముంబై జ‌ట్టు 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ముంబై జ‌ట్టు కేవ‌లం 139 పరుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. అంతకుముందు వర్షం కారణంగా మ్యాచ్ అధికారులు 16 ఓవర్ల మ్యాచ్ ను నిర్వహించాలని నిర్ణయించారు. ముంబై జ‌ట్టు ఛేజింగ్ ను అద్భుతంగా ప్రారంభించిందనీ, అయితే స్పిన్ ద్వయం సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి అసాధారణ బౌలింగ్ మ్యాచ్ లో మ‌లుపు తిప్పార‌ని పియూష్ చావ్లా పేర్కొన్నాడు. "మేము ఆట‌ను బాగా ప్రారంభించాము, కానీ సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలు అద్భుత బౌలింగ్  స్పెల్ తో మ్యాచ్ ను మ‌లుపు తిప్పారు. కేకేఆర్ స్పిన్నర్లు బౌలింగ్ చేస్తున్న తీరు, బ్యాటింగ్ చేసే విధానం చూస్తేనే టోర్నీని గెలుచుకోవచ్చు. కానీ ప్లేఆఫ్స్ లో ఎలా రాణిస్తార‌న్న‌దే ముఖ్యం. ఐపీఎల్లో ఆటను మార్చాలంటే కేవలం నాలుగు ఓవర్లు చాలు. వారి ఆటగాళ్లంతా బాగా రాణిస్తున్నారు'' అని చావ్లా మ్యాచ్ అనంతరం అన్నాడు. అలాగే, టీ20 క్రికెట్ అంటేనే ఊపు అనీ, నైట్ రైడర్స్ జట్టుపై ఆరంభం నుంచి అది లభించలేదని పేర్కొన్నాడు.

Latest Videos

గుజ‌రాత్ ఆశలపై నీళ్లు.. కేకేఆర్ తో మ్యాచ్ ర‌ద్దు.. ప్లేఆఫ్స్ రేసు నుంచి గిల్ జ‌ట్టు ఔట్..

''టీ20 క్రికెట్ అంటే ఊపుకు సంబంధించింది.. కానీ దురదృష్టవశాత్తూ మొదటి నుంచి ఆ ఊపు రాలేదు. కొన్నిసార్లు బాగా బౌలింగ్ చేసి, ఆ తర్వాత అంత బాగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాం. అదేవిధంగా, కొన్నిసార్లు మేము బాగా బ్యాటింగ్ చేసినా.. మంచి బౌలింగ్  చేయ‌లేక‌పోయాము. కాబట్టి మనకు ఒక డిపార్ట్ మెంట్ లో లోటు ఉండటమే కాదు. ఒక యూనిట్ గా మేం కొన్ని మ్యాచుల్లో విఫలమయ్యాం. ఆ వాస్తవాన్ని ఒక జట్టుగా అంగీకరించాలని'' చావ్లా అన్నాడు. అలాగే, 'మాకు అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉంది. కానీ కొన్నిసార్లు పరిస్థితులు చక్కబడలేదు. నేను ఎల్లప్పుడూ పెద్ద ఆటలలో చెప్పినట్లు, మీరు ఒక జట్టుగా గెలవాల్సిన చిన్న క్షణాలు ఉన్నాయి. కానీ ఈ రోజు దురదృష్టవశాత్తూ ఆ చిన్న క్షణాల్లో ఓడిపోయాం' అని  చావ్లా పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే వర్షం కారణంగా 16 ఓవర్ల మ్యాచ్ ను నిర్వ‌హించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 16 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 157 ప‌రుగులు చేసింది. వెంక‌టేష్ అయ్య‌ర్ 42 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్ గా ఉన్నాడు. స్వ‌ల్ప టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ముంబై 8 వికెట్లు కోల్పోయి 139 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ముంబైకి ఇషాన్ కిష‌న్ (40 ప‌రుగులు), రోహిత్ శ‌ర్మ (19 ప‌రుగులు) మంచి ఆరంభం అందించిన త‌ర్వాత వ‌చ్చిన ప్లేయ‌ర్లు క్రీజులో నిల‌వ‌క‌పోవ‌డంతో ముంబైకి ఓట‌మి త‌ప్ప‌లేదు.

రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ ఎవరు? బీసీసీఐ దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలు ఏమిటి?

click me!