నా పిల్లలతో పాటు...: ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన వీవీఎస్ లక్ష్మణ్

By telugu teamFirst Published Jan 26, 2020, 1:33 PM IST
Highlights

తన హిందీ భాష అభ్యాసంపై వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తనకు ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడం అలవాటు లేదని, అయినప్పటికీ సవాలుగా తీసుకుని ఆడానని లక్ష్మణ్ చెప్పారు.

ముంబై: తన హిందీ క్రికెట్ వ్యాఖ్యానంపై హైదరాబాదు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటరీపై ఉన్న ఇష్టంతో వ్యాఖ్యాతగా మారినట్లు ఆనయ చెప్పారు. హిందీలో వ్యాఖ్యాతగా మారడానికి చాలా కష్టపడ్డానని, దాని కోసం తన పిల్లలతో కలిసి ట్యూషన్ కు వెళ్లానని ఆయన చెప్పారు. 

ఇండియా టుడే ఇన్ స్పిరేషన్ తాజా ఎపిసోడ్ లో వివీఎస్ లక్ష్మణ్ ఆ విషయాలను వెల్లడించారు. హిందీలో మెరుగు కావడానికి ఇంకా ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. పని ఏదైనా దానిపై ఇష్టం పెంచుకోవాలని ఆయన అన్నాడు. ఇప్పుడు కామెంటరీని ప్రేమిస్తున్నట్లు తెలిపారు. 

ఇంకా కూడా క్రికెట్ లో పాలు పంచుకుంటున్నందుకు అదృష్టవంతుడినని అంటూ వ్యాఖ్యాతగా అవకాశం ఇచ్చిన స్టార్ స్పోర్ట్స్ కు ధన్యవాదాలు తెలిపారు. స్టార్ స్పోర్ట్స్ సంజోగ్ తో తనకు పరిచయం ఉందని, హిందీ భాష ప్రేక్షకులకు ఎంతో అవసరమో ఆయనే వివరించారని వీవీఎస్ చెప్పారు. 

Also Read: టీ20 ప్రపంచ కప్ 2020: ధోనీ వేస్ట్, వీవీఎస్ లక్ష్మణ్ జట్టు ఇదే.

హైదరాబాదులో పెరిగిన తాను హిందీలో మాట్లాగలనని, కానీ హైదరాబాద్ హిందీ, కామెంటరీలో వీక్షకులు వినాలనుకునే హిందీ రెండు వేర్వేరని, అది తనకు కష్టమనిపించిందని ఆయన అన్నారు. దాంతో తన ముందు రెండే మార్గాలు మిగిలాయని, కామెంటరీ చెప్పడాన్ని వదులుకోవాలి లేదా హిందీ కష్టపడి నేర్చుకోవాలనే మార్గాలు మాత్రమే ఉన్నాయని ఆయన చెప్పారు. 

తాను రెండో దాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. దాంతో హిందీ నేర్చుకోవడానికి చాలా శ్రమించానని, తమ పిల్లలు హిందీ ట్యూషన్ కు వెళ్తుంటే తాను వారితో పాటు ట్యూషన్ కు వెళ్లానని చెప్పారు. 

 కెరీర్ లో కూడా బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో పలు సవాళ్లను ఎదుర్కున్నట్లు తెలిపారు. ఓపెనింగ్ తనకు సహజంగా అబ్బలేదని, తనకు తగింది కూడా కాదని, దాన్ని తాను సవాల్ గా తీసుకున్నానని ఆయన చెప్పారు.

Also Read: సచిన్, వీవీఎస్ లక్ష్మణ్ లకు బీసీసీఐ నోటీసులు

ఆరో స్థానంలో బ్యాటింగ్ లో తనకు పెద్దగా అనుభవం లేదని, కానీ జట్టు కోసం ఆడాల్సి వచ్చిందని, దాంతో దాన్ని సవాలుగా తీసుకున్నానని ఆయన చెప్పారు. దాని కోసం కూడా శ్రమించానని, ఆ స్థానలో బ్యాటింగ్ చేశానని వీవీఎస్ లక్ష్మణ్ చెప్పారు.

2001లో కోల్ కతాలో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచులో తొలి ఇన్నింగ్సులో తాను 59 పరుగులు చేశానని, అయితే రెండో ఇన్నింగ్సులో మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలని మాజీ కోచ్ జాన్ రైట్ తనకు చెప్పాడని ఆయన అన్నారు. బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ పొందిన వీవీఎస్ లక్ష్మణ్ రెండో ఇన్నింగ్సులో 171 పరుగులు చేశాడు. రాహుల్ ద్రావిడ్ తో కలిసి ఐదో వికెట్ కు 376 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 

తనకు నెంబర్ 3 స్థానం సహజంగా అబ్బిందని, నెంబర్ 6, నెంబర్ వన్ సహజంగా అబ్బలేదని ఆయన చెప్పారు. ఆ రెండు స్థానాల్లో బ్యాటింగ్ చేయడాన్ని సవాలుగా తీసుకున్నానని ఆయన చెప్పారు. 

Also Read: ప్రపంచకప్... పంత్ కి షాకిచ్చిన వీవీఎస్ లక్ష్మణ్

తనక 13 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి హైదరాబాదుకు ఆడినప్పుడు మూడో స్థానంలోనే బ్యాటింగ్ కు దిగానని, అందువల్ల అది సహజంగా తనకు అబ్బిందని ఆయన చెప్పారు.

తనకు ఆ విషయం ఇప్పటికీ గుర్తుందని, తాను చివరి బ్యాట్స్ మన్ గా తొలి ఇన్నింగ్సులో వెనక్కి వచ్చానని, వెంటనే చేంజింగ్ రూంకు వెళ్లి ప్యాడ్స్ విప్పుకుంటుండగా జాన్ రైట్ తన వద్దకు వచ్చి తన భుజంపై తట్టి ప్యాడ్స్ విప్పొద్దని చెప్పాడని ఆయన చెప్పాడు. తన ముఖంలోని ఆశ్చర్యాన్ని కనిపెట్టి మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతున్నావని రైట్ చెప్పాడని ఆయన అన్నారు. 

అది తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని, ఆ నిర్ణయానికి ప్రతిస్పందించడానికి తనకు సమయం కూడా లేదని, తాము ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. రమేష్, ఎస్ఎస్ దాస్ బ్యాటింగ్ కు దిగారని, రెండు ఇన్నింగ్సుల మధ్య కేవలం పది నిమిషాల వ్యవధి మాత్రమే ఉందని ఆయన చెప్పారు. 

తాను వెంటనే రెడీ అయి బయటకు వెళ్లి కారిడార్ లో కూర్చున్నానని, ఓపెనింగ్ జోడీ ఆట చూడడం ప్రారంభించానని, మూడో స్థానంలో బ్యాటింగ్ దిగడానికి వచ్చిన అవకాశంతో తనలో విశ్వాసం పెరిగిందని, ఆనందం వేసిందని ఆయన చెప్పారు.

click me!