బీఎండబ్ల్యూ సిరీస్ లోని ఖరీదైన కారు కొన్న ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా.. ధర ఎంతో తెలుసా..?

Published : Oct 18, 2021, 01:38 PM IST
బీఎండబ్ల్యూ సిరీస్ లోని ఖరీదైన కారు కొన్న ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా.. ధర ఎంతో తెలుసా..?

సారాంశం

Prithvi Shaw: క్యాష్ రిచ్ లీగ్ గా పేరున్న ఐపీఎల్ తో భారత్ లోని యువ క్రికెటర్ల లైఫ్ స్టైలే మారిపోయింది. ఒకప్పుడు ఏమీ లేని స్థితి నుంచి వచ్చి ఇప్పుడు కుటుంబానికి ఆసరాగా ఉండటమే గాక రిచ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)ఓపెనర్, టీమిండియా (Team india) క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) ఖరీదైన కారు కొన్నాడు.  ఖరీదైన ధరలతో పాటు కంఫర్ట్ గా ఉండే బీఎండబ్ల్యూ (BMW) కారును అతడు కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే సోషల్ మీడియా వేదికగా  తెలియజేశాడు. ఇన్స్టాగ్రామ్  వేదికగా పోస్టు పెడుతూ.. భావోద్వేగ కామెంట్ కూడా జతచేశాడు. ఈ కారును తనకు తానే గిఫ్ట్  గా ఇచ్చుకుంటున్నానని పేర్కొన్నాడు.

21 ఏండ్ల ఈ మహారాష్ట్ర క్రికెటర్ ఐపీఎల్ లో ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు. మహారాష్ట్రలోని థానే కు చెందిన  షా.. సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. అండర్-16 స్థాయిలోనే అదరగొట్టిన షా.. మరో సచిన్ అవుతాడని అందరూ భావించారు. సచిన్ లాగే చిన్న వయసులోనే క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్న షా.. దేశవాళీ క్రికెట్ లో పలు రికార్డులు కూడా సాధించాడు.

కాగా, ఐపీఎల్ లో ఢిల్లీ తరఫున ఆడుతున్న ఈ ఓపెనర్.. తాజాగా దుబాయ్ నుంచి తిరిగిరాగానే బీఎండబ్ల్యూ 6 గ్రాన్ టురిస్మో (BMW 6 Series Gran Turismo) ను కొనుగోలు చేశాడు. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ కారు విలువ రూ. 68.50 లక్షలు (ఎక్స్ షో రూం ధర) గా ఉంది. ఈ కారు  పెట్రోల్, డీజిల్ వెర్షన్ లో లభ్యమవుతున్నది. 

 

కారు కొన్న సందర్భంగా షా ఆసక్తికర కామెంట్ పెట్టాడు. ‘కింది స్థాయి నుంచి మొదలై ఇప్పుడు ఇక్కడ ఉన్నాం’ అని రాసుకొచ్చాడు.  సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన షా.. క్రికెట్ లోకి రావడానికి చాలా కష్టపడ్డాడు. షా షేర్ చేసిన ఫోటోలో కారు ముందు అతడితో పాటు షా తండ్రి పంకజ్ షా కూడా ఉన్నాడు. కాగా.. బీఎండబ్ల్యూ కూడా షా కారు కొన్న అనంతరం ట్విట్టర్ లో పోస్టు పెట్టింది. 

 

ఐపీఎల్-14 సీజన్ లో ఢిల్లీ  (DC) తరఫున ఆడిన పృథ్వీ షా.. 15 మ్యాచుల్లో 479 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ తొలి ప్లేఆఫ్స్ లో  చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తో జరిగిన మ్యాచ్ లో 60 పరుగులతో చెలరేగాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ జట్టు ప్లేఆఫ్స్ లో రెండు అవకాశాలను చేజార్చుకుని ఫైనల్స్ కు చేరకుండానే నిష్క్రమించింది.

ఇది కూడా చదవండి: T20 WorldCup: ఒకప్పుడు అమెజాన్ డ్రైవర్.. ఇప్పుడు టీ20 స్టార్.. స్కాట్లాండ్ స్టార్ గ్రీవ్స్ సక్సెస్ స్టోరీ

 

PREV
click me!

Recommended Stories

ఆక్షన్‌లోకి కొత్త సరుకొచ్చింది బాసూ.! వీళ్ల కోసం గట్టి పోటీ.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
'మాకు డబ్బులు లేవు సార్'.. టాప్ కుర్రోళ్లపైనే ముంబై టార్గెట్..