IPL 2020: సీఎస్‌కే ఆటతీరుపై వీరూ సెటైర్... బ్యాట్స్‌మెన్‌కి గ్లూకోజ్ ఎక్కించాలంటూ...

Published : Sep 26, 2020, 07:30 PM ISTUpdated : Sep 26, 2020, 07:35 PM IST
IPL 2020: సీఎస్‌కే ఆటతీరుపై వీరూ సెటైర్... బ్యాట్స్‌మెన్‌కి గ్లూకోజ్ ఎక్కించాలంటూ...

సారాంశం

చెన్నై బ్యాట్స్‌మెన్‌కి గ్లూకోజ్ పట్టించాల్సి ఉంటుందేమోనన్న వీరూ... బ్యాటింగ్ చూస్తుంటే నిద్ర వస్తుందన్నట్టుగా ఫోటో ట్వీట్ చేసిన సీఎస్‌కె అధికారిక ఖాతా...  

IPL 2020లో భాగంగా యంగ్ టీమ్ ఢీల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడింది. 176 పరుగుల లక్ష్యచేధనలో నిర్ణీత 20 ఓవర్లలో 131 పరుగులకే పరిమితమైంది. ఆటలో గెలుపు ఓటములు సహజం కానీ కనీసం పోరాట పటిమ కూడా చూపించకుండానే చేతులేత్తేసింది సీఎస్‌కే.

‘మోస్ట్ సక్సెస్‌ఫుల్’ కెప్టెన్ మహేంద్ర సింగ్ కెప్టెన్సీలో జట్టు ఇలా ఆడడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించాడు భారత సీనియర్ ఓపెనర్, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.
‘చెన్నై బ్యాట్స్‌మెన్ సింపుల్‌గా అవుటై వెళ్లిపోతున్నారు. తర్వాతి మ్యాచ్‌ నుంచి బ్యాటింగ్ రావడానికి గ్లూకోజ్ పట్టించాల్సింది ఉంటుందేమో’ అంటూ సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్.

చేతిలో వికెట్లు ఉన్నా, రన్‌రేట్ భారీగా ఉన్నా... ధోనీ, జడేజా లాంటి భారీ హిట్టర్లు షాట్లు ఆడడానికి చాలా ఇబ్బంది పడడమే ఈ విమర్శలకి కారణం. స్వయంగా సీఎస్‌కే అకౌంట్ నుంచే ‘స్లో బ్యాటింగ్ చూస్తుంటే... నిద్ర వస్తోంది’ అన్నట్టుగా ఓ ఫోటోను పోస్టు చేశారంటే చెన్నై బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 

 

 

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?