IPL 2020: ‘బుల్లి హార్ధిక్ పాండ్యా’... అప్పుడే టీవీ చూసేస్తున్నాడుగా!!

Published : Sep 26, 2020, 05:38 PM ISTUpdated : Sep 26, 2020, 05:43 PM IST
IPL 2020: ‘బుల్లి హార్ధిక్ పాండ్యా’... అప్పుడే టీవీ చూసేస్తున్నాడుగా!!

సారాంశం

కొడుకు టీవీ చూస్తున్న ఫోటోను పోస్టు చేసిన హార్ధిక్ పాండ్యా... జనవరి 1, 2020న నటాశాతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న పాండ్యా... పెళ్లి కాకముందే తల్లిదండ్రులుగా మారిన నటాశా, హార్ధిక్ పాండ్యా...

భారత క్రికెట్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు ఓ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అదరగొట్టే హార్ధిక్ పాండ్యా, ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరుపున ఐపీఎల్‌లో పాల్గొంటున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటిదాకా తన రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు పాండ్యా.

వెన్నెముక ఆపరేషన్ తర్వాత తిరిగి ఫామ్ అందుకోవడానికి ఇబ్బంది పడుతున్న పాండ్యా, బాలీవుడ్ హీరోయిన్ నటాశా స్టాన్కోవిక్‌తో ఈ ఏడాది జనవరిలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. పెళ్లి కాకముందే ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది నటాశా. నటాశా, పాండ్యాలకు ఆగస్టు 2న కొడుకు పుట్టాడు. ఐపీఎల్ కోసం ప్రియురాలు, కొడుకుని వదిలి దుబాయ్ చేరుకున్న హార్ధిక్ పాండ్యా, వారిని బాగా మిస్ అవుతున్నాడట.

 

 

నెలన్నర వయసులోనే టీవీ చూస్తున్నాడట బుల్లి పాండ్యా. కొడుకు టీవీ చూస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పాండ్యా, ‘మై ఛీర్ స్వాడ్’ అని కామెంట్ చేశాడు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో పాండ్యా హిట్ వికెట్ రూపంలో అవుటైన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

India Test Captains Records: శ్రీలంకలో భారత టెస్టు కెప్టెన్ల రికార్డులు.. నంబర్ 1 ఎవరో తెలుసా?
Indian Cricket: మ్యాచ్ లేకపోతే డ్యూటీకే.. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న టాప్ టీమిండియా స్టార్స్ వీరే