రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ స్టార్ పేసర్... కోచ్‌గా కొత్త అవతారం..

By team teluguFirst Published Sep 26, 2020, 6:05 PM IST
Highlights

2003లో క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన ఉమర్ గుల్, పాకిస్తాన్ క్రికెట్ జట్టులో స్టార్ పేసర్‌గా గుర్తింపు...

2007 టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుల్ రికార్డు...

పాకిస్తాన్ స్టార్ పేసర్ ఉమర్ గుల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ఉమర్ గుల్... రిటైర్మెంట్ తర్వాత కోచ్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నట్టు ప్రకటించాడు. 2003లో క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన ఉమర్ గుల్, పాకిస్తాన్ క్రికెట్ జట్టులో స్టార్ పేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

47 టెస్టుల్లో 163 వికెట్లు తీసిన ఉమర్ గుల్, 130 వన్డే మ్యాచుల్లో 179 వికెట్లు పడగొట్టాడు. 60 టీ20 మ్యాచుల్లో 85 వికెట్లు తీసిన ఉమర్ గుల్, 2007 టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో 7 మ్యాచులాడి 13 వికెట్లు తీసిన ఉమర్ గుల్... 2009 టీ20 విశ్వకప్‌లో 13 వికెట్లు తీశాడు.

2016లో ఇంగ్లాండ్‌పై చివరి మ్యాచ్ ఆడిన ఉమర్ గుల్, ఆ తర్వాత జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. క్రికెట్ రిటైర్మెంట్‌కి ముందే పాక్ క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న ఉమర్ గుల్, పాక్ జట్టుకి బౌలింగ్ కోచ్‌గా నియమితం కావచ్చు.

click me!