ఢిల్లీ భూకంపంపై వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్... వీరూ ట్వీట్‌కి నెటిజన్స్ ఫిదా...

Published : Dec 18, 2020, 12:07 PM IST
ఢిల్లీ భూకంపంపై వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్... వీరూ ట్వీట్‌కి నెటిజన్స్ ఫిదా...

సారాంశం

‘అన్నీ వణికిపోయాయి భయ్యా...’ అంటూ ట్వీట్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్... వీరూ ట్వీట్‌పై ఢిల్లీ వాసుల నుంచి విశేషమైన స్పందన..

క్రికెట్‌‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో తెగ బిజీగా ఉంటున్నాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. టెస్టు క్రికెట్‌ను కూడా వన్డేల్లా ఆడే వీరూ... క్రికెట్‌తో పాటు రాజకీయాలు, సినిమాలు, సామాజిక అంశాలు... ఇలా ప్రతీ విషయంపై తనదైన స్టైల్‌లో స్పందిస్తున్నాడు.

తాజాగా ఢిల్లీని ‘షేక్’ చేసిన భూకంపాన్ని కూడా వదలలేదు వీరేంద్ర సెహ్వాగ్. ఢిల్లీలో గురువారం సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. రికార్డు స్కేల్‌పై 4.2 మాగ్నిట్యూట్‌గా నమోదైన ఈ భూకంపంపై స్పందించిన వీరూ... ‘అన్నీ వణికిపోయాయి భయ్యా...’ అంటూ ట్వీట్ చేశాడు.

దీనికి సోషల్ మీడియా నుంచి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్‌పై స్పందించిన ఓ ఢిల్లీ వాసి... ‘హ హ అవును... నిజంగానే ఓ క్షణం 2020 పోతూ పోతూ మనల్ని కూడా తీసుకుపోతుందని అనిపించింది...’ అంటూ కామెంట్ చేస్తే, ‘డోర్లు, కిటికీలు కూడా వణికిపోయాయి...’ అంటూ మరో హస్తినవాసి కామెంట్ చేశాడు. 

PREV
click me!

Recommended Stories

Virat Kohli : సచిన్, పాంటింగ్ లకు షాకిచ్చిన విరాట్ కోహ్లీ.. సూపర్ రికార్డు !
Shreyas Iyer : 10 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపులు.. అయ్యర్ వస్తే అదిరిపోవాల్సేందే మరి !