INDvsAUS: స్వల్ప స్కోరుకే టీమిండియా ఆలౌట్... 11 పరుగులకే నాలుగు వికెట్లు...

By team teluguFirst Published Dec 18, 2020, 10:08 AM IST
Highlights

11 పరుగులు, 23 నిమిషాలు... నాలుగు వికెట్లు...

మిచెల్ స్టార్క్‌కి నాలుగు వికెట్లు... 3 వికెట్లు తీసిన ప్యాట్ కమ్మిన్స్...

56 పరుగుల తేడాతో చివరి ఏడు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

11 పరుగులు, 23 నిమిషాలు... నాలుగు వికెట్లు...క్షప్తంగా రెండో రోజు భారత ఇన్నింగ్స్ సారాంశం ఇది.. 233/6 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా... కేవలం 11 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది.

ఆదుకుంటాడని భావించిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాతో పాటు టెయిలెండర్లు ఎవ్వరూ ఆసీస్ బౌలింగ్ ముందు నిలవలేకపోయారు... రెండో రోజు మూడో బంతికే రవిచంద్రన్ అశ్విన్ (15 పరుగులు)ను అవుట్ చేసి షాక్ ఇచ్చాడు కమ్మిన్స్. ఆ తర్వాత వృద్ధిమాన్ సాహా కూడా 9 పరుగులకే స్టార్క్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

ఉమేశ్ యాదవ్ 6, షమీ డకౌట్ కాగా... బుమ్రా 4 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు... ఆసీస్ బౌలర్లలో సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్‌కి 4 వికెట్లు దక్కగా, ప్యాట్ కమ్మిన్స్ 3, జోష్ హజల్‌వుడ్, నాథన్ లియాన్ చెరో వికెట్ తీశారు.

click me!