INDvsAUS 1st Test: టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా...

Published : Dec 17, 2020, 09:08 AM ISTUpdated : Dec 17, 2020, 09:10 AM IST
INDvsAUS 1st Test: టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా...

సారాంశం

ఆడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య మొట్టమొదటి డే నైట్ టెస్టు... టీమిండియాకి రెండో పింక్ బాల్ టెస్టు... ఇంతకుముందు బంగ్లాదేశ్‌లో డే నైట్ టెస్టు ఆడిన భారత జట్టు...

INDvAUS 1st Test: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న మొట్టమొదటి డే- నైట్ టెస్టులో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల మధ్య 1947 నుంచి ఇప్పటిదాకా 98 టెస్టు మ్యాచులు జరిగగా... ఇది మొట్టమొదటి పింక్ బాల్ టెస్టు.

ఈ మ్యాచ్ ద్వారా ఆస్ట్రేలియా యంగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ టెస్టు ఆరంగ్రేటం చేస్తున్నాడు. మరోవైపు టీమిండియా మొదటి టెస్టుకి ఒకరోజు ముందే తుది జట్టును ప్రకటించింది.

భారత జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింకా రహానే (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, ఛతేశ్వర్ పూజారా, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్

ఆస్ట్రేలియా జట్టు:
జో బర్న్స్, మాథ్యూ వేడ్, లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, టిమ్ పైన్, ప్యాట్ కమ్మిన్స్, స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హజల్‌వుడ్ 

 

PREV
click me!

Recommended Stories

టీమిండియాకు మాజీ కోచ్ ద్రావిడ్ గట్టి హెచ్చరిక.. ఇవి పాటించకపోతే టెస్ట్ క్రికెట్ గోవిందా
Abhishek Sharma : 2024 వరకు అనామకుడు.. 2026లో వరల్డ్ నంబర్ 1 టీ20 క్రికెటర్.. రెండేళ్లలో ఎలా సాధ్యమయ్యింది..?