కోహ్లీని అదృష్ట దేవత వదిలేసింది, కపిల్ మాటలు ఉత్తవే: సెహ్వాగ్

By telugu teamFirst Published Mar 5, 2020, 6:00 PM IST
Highlights

విరాట్ కోహ్లీ వైఫల్యానికి మాజీ టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్ చెప్పిన కారణంతో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విభేదించాడు. కంటికి, చేతికి మధ్య సమన్వయం కుదరకపోవడం ఉత్తదేనని తేల్చేశాడు.

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ థియరీని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తోసిపుచ్చాడు. విరాట్ కోహ్లీ కంటికి, చేతికి మధ్య సమన్వయం కుదరకపోవడం వల్ల విఫలవుతున్నాడనేది నిజం కాదని ఆయన అన్నాడు. 

30 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ప్రతి బ్యాట్స్ మన్ ఎదుర్కునే ఇబ్బంది ఇదేనంటూ కపిల్ దేవ్ సెహ్వాగ్ పేరును కూడా ప్రస్తావించాడు. వీరేంద్ర సెహ్వాగ్ కూడా అటువంటి ఇబ్బందినే ఎదుర్కున్నాడని కపిల్ చెప్పాడు. 

Also Read: అసలు సమస్య ఇదీ: విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ గుట్టు విప్పిన కపిల్ దేవ్

కపిల్ దేవ్ వాదనతో సెహ్వాగ్ విభేదించాడు. చేతికి, కంటికి మధ్య సమన్వయం కుదకపోవడం వల్ల కోహ్లీ విఫలం కాలేదని, అది జరగడానికి కొంత కాలం పడుతుందని, రాత్రికి రాత్రి అది జరగదని, కోహ్లీ ఫామ్ కోల్పోయాడని, మంచి బంతులకే కోహ్లీ అవుటయ్యాడని ఆయన అన్నాడు.

విరాట్ కోహ్లీ ప్రయత్నాలు చేశాడని, కానీ అదృష్టం అతన్ని వదిలేసిందని సెహ్వాగ్ అన్నాడు. న్యూజిలాండ్ లో బంతి ఎక్కువగా సీమ్ అయిందని, పరుగులు రానప్పుడు సమస్య తీవ్రత పెరుగుతూ ఉంటుందని, బంతిని వదులేస్తూ ఫ్రంట్ ఫుట్ మీద ఆడడాన్ని అలవాటు చేసుకోవాలని సెహ్వాగ్ చెప్పాడు. 

Also Read: అలా అయితే ఐపీఎల్ ఆడొద్దు: విరాట్ కోహ్లీకి కపిల్ దేవ్ చురకలు

రెండు టెస్టు మ్యాచుల్లో న్యూజిలాండ్ పై కోహ్లీ 9.50 సగటుతో కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. 

click me!