ఐసీసి మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీల ఫైనల్ మ్యాచులో భారత ప్రత్యర్థి ఖరారైంది. భారత్ ఈ నెల 8వ తేదీన ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియాపై తలపడాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఆసీస్ ఫైనల్ కు చేరుకుంది.
సిడ్నీ: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీల ఫైనల్లో భారత ప్రత్యర్థి ఖరారైంది. భారత్ ఈ నెల 8వ తేదీన ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియాతో తలపడనుంది. రెండో సెమీఫైనల్ మ్యాచులో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా ఐదు పరుగుల తేడాతో గెలిచింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
ఇంగ్లాండు, భారత్ మధ్య జరగాల్సిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన ఇండియా ఫైనల్ కు చేరుకుంది. గ్రూప్ బీలో దక్షిణాఫ్రికా లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించింది. అయితే, రెండో సెమీ ఫైనల్ ఆట రద్దు కాకపోవడంతో ఇరు జట్లు తలపడ్డాయి. దక్షిణాఫ్రికాపై విజయం సాధించడంతో ఆస్ట్రేలియా పైనల్ కు చేరుకుంది.
undefined
Also Read: థ్రిల్లయ్యా, ఇంగ్లాండును చూస్తే బాధేస్తోంది: మిథాలీ రాజ్
రెండో సెమీ ఫైనల్ మ్యాచులో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఆస్ట్రేలియాపై ఫీల్డింగ్ ను ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 13 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది.
ర్షం కారణంగా ఆట జరిగే పరిస్థితి లేకపోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా గెలిచినట్లు ప్రకటించారు. 13 ఓవర్లలో దక్షిణాఫ్రికా 98 పరుగులు చేయాల్సి ఉండగా, 92 పరుగులు చేసింది.
Also Read: ఫైనల్లోనూ...: హర్మాన్ ప్రీత్ కౌర్ మహిళల జట్టుపై విరాట్ కోహ్లీ