కోహ్లీ, రోహిత్ ల మధ్య విభేదాలు... అనుష్క శర్మ కన్ఫర్మ్ చేస్తున్నారా..?

Published : Jul 26, 2019, 08:06 PM ISTUpdated : Jul 26, 2019, 08:07 PM IST
కోహ్లీ, రోహిత్ ల మధ్య విభేదాలు... అనుష్క శర్మ కన్ఫర్మ్ చేస్తున్నారా..?

సారాంశం

రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీ వివాదంలోకి అనుష్క శర్మ తలదూర్చారు. తనతో పాటు భర్త  కోహ్లీని రోహిత్ ఇన్ట్సాగ్రామ్ లో అన్ ఫాలో చేయగా...అదే మాధ్యమం ద్వారా అనుష్క ఓ పోస్ట్ చేశారు. ఇలా పరోక్షంగా కోహ్లీ-రోహిత్ ల వివాదం గురించి ఆమె స్పందించారు.  

ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ మెగా టోర్నీ భారత జట్టులో అలజడిని రేపింది. ఈ టోర్నీకి ముందువరకు ఆటగాళ్ల సమిష్టితత్వంతో టీమిండియా ప్రయాణం సాఫీగా సాగింది. అయితే ఈ  మెగా టోర్నీలో భారత ఆటగాళ్ల మధ్య చిచ్చు రాజుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ,  వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య వివాదం మరింత ముదిరినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇన్నాళ్లు దీన్ని అసత్య ప్రచారమేనని కొట్టిపారేస్తూ వచ్చిన అభిమానులను రోహిత్ శర్మ, కోహ్లీ భార్య అనుష్క శర్మ సోషల్ మీడియా మెసేజ్ లు డైలమాలో  పడేస్తున్నాయి. 

రోహిత్ శర్మ ఇన్స్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మలను అన్ ఫాలో అయ్యారు. అయితే ఇలా అతడు అన్ ఫాలో అయిన  కొద్దిసేపటికే అనుష్క శర్మ తన ఇన్స్టాగ్రామ్  లో ఓ కోటేషన్ తో కూడిన ఫోటోను పోస్ట్ చేశారు. '' తప్పుడు వార్తలు ప్రచారమవుతున్న సమయంలో నిజం మాత్రమే నిశబ్దంతో కరచాలనం చేస్తుంది... తెలివైన వ్యక్తి ఒక్కసారి మాత్రమే ఏమీ లేదని చెబుతాడు’అన్న కోటేషన్  ను కలిగిన ఫోటోను పోస్ట్ చేశారు. కోహ్లీ-రోహిత్ ల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ గురించే అనుష్క ఇలా పరోక్షంగా స్పందించి వుంటుందని అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

ఇన్నాళ్లు కోహ్లీ, అనుష్క లను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిన రోహిత్ ఒక్కసారిగా వారిద్దరిని అన్ ఫాలో అవడం అభిమానులు షాక్ గురయ్యేలా చేస్తే అనుష్క  పోస్ట్  మరింత గందరగోళంలోకి నెట్టింది. దీంతో ఇన్నాళ్లు టీమిండియాలో ఎలాంటి లుకలుకలు లేవని నమ్ముతూవస్తున్న అభిమానులకు ఇలా సోషల్ మీడియా ద్వారా రోహిత్, అనుష్కలు కన్ఫర్మ్ చేసినట్లయింది. 

రోహిత్ తమను అన్ ఫాలో అయినప్పటికి విరాట్ కోహ్లీ మాత్రం అలా చేయడంలేదు. రోహిత్ తో పాటు అతడి భార్య రితికలను ఫాలో అవుతున్నాడు. అయితే  రోహిత్ అన్ ఫాలో విషయంపై కోహ్లీ రియాక్ట్ కాకున్నా అనుష్క మాత్రం పరోక్షంగా రియాక్ట్ అయ్యారు. 


PREV
click me!

Recommended Stories

అబ్బ సాయిరామ్.! SRH ప్లేయర్‌పై బీసీసీఐ బ్యాన్.. పండుగ చేసుకుంటున్న ఆరెంజ్ ఆర్మీ
IND vs SA : కోహ్లీ, రోహిత్‌లకు క్రెడిట్ ఇవ్వని గంభీర్‌.. ఇదెక్కడి రచ్చ సామీ !