IPL 2024: మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఐపీఎల్ 2024 లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటతో రాణిస్తాడని సౌతాఫ్రికా దిగ్గజ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అన్నాడు.
Virat Kohli: టీ20 ప్రపంచ కప్ 2024 కు ముందు మరో క్రికెట్ మెగా లీగ్ కు సర్వం సిద్దమైంది. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024). మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలవని ఆర్సీబీ ఈ సీజన్ లో ఎలాగైన ఛాంపియన్ గా నిలవాలని వ్యూహాలు రచిస్తోంది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సైతం ఈ సారి కప్పు గెలుస్తామనే ధీమాతో ఉన్నాడు.
ఈ క్రమంలోనే రాబోయే ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు తన మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సహచరుడు విరాట్ కోహ్లీపై సౌతాఫ్రికా దిగ్గజ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. రాబోయే ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీ అదరగొట్టడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశాడు. వ్యక్తిగత కారణాలతో దాదాపు రెండు నెలల పాటు కోహ్లి పోటీ క్రికెట్‌కు దూరమైనప్పటికీ, కోహ్లీ టాప్ ఫామ్‌లో ఉంటాడని ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.
బాలీవుడ్ స్టార్లతో అదిరిపోయేలా ఐపీఎల్ 2024 ఆరంభ వేడుకలు..
కోహ్లి తన కుమారుడు అకాయ్ కు స్వాగతం పలికేందుకు ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ ఐపీఎల్ తో క్రికెట్ గ్రౌండ్ లోకి దిగబోతున్నాడు. ఇక ఐపీఎల్ లో 200 మ్యాచ్‌లలో 7,263 పరుగులతో టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి అద్భుతమైన ఐపీఎల్ కెరీర్‌ను డివిలియర్స్ ప్రశంసించాడు. విరాట్ తిరిగి వస్తున్నాడనీ, రాబోయే సీజన్ లో అత్యుత్తమమైన ప్రదర్శన ఇవ్వనున్నాడని పేర్కొన్నాడు.
ఐపీఎల్ లో బెస్ట్ బౌలర్ ఎవరు? ఐపీఎల్ చరిత్రలో బౌలింగ్ రికార్డులు ఇవే..