బాలీవుడ్ స్టార్ల‌తో అదిరిపోయేలా ఐపీఎల్ 2024 ఆరంభ‌ వేడుక‌లు..

By Mahesh Rajamoni  |  First Published Mar 20, 2024, 9:35 PM IST

IPL 2024 opening Ceremony: రెండుసార్లు ఆస్కార్ అవార్డు గ్రహీత, గాయకుడు ఏఆర్ రెహమాన్, ప్రముఖ నేపథ్య గాయకుడు సోనూ నిగమ్, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తమ అద్భుతమైన ప్రదర్శనలతో ఎంఏ చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ 2024 ప్రారంభ వేడుక‌ల‌తో వేదికను హోరెత్తించనున్నారు.
 


IPL 2024 opening Celebrations : ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా టోర్నమెంట్ ల‌లో ఒక‌టైన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ మరొక సీజన్‌తో తిరిగి వచ్చింది. ప్ర‌తి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజ‌న్ మార్చి 22న గ్రాండ్ వేడుక‌ల‌తో ప్రారంభం కానుంది. ప్రారంభ వేడుకలో బాలీవుడ్ స్టార్లు త‌మ అద్భుత‌ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో చెన్నై వేదిక‌ను హోరెత్తించ‌నున్నారు. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

ఐపీఎల్ 2024 ప్రారంభ వేడుకలకు ముందు ఈవెంట్‌లో ప్రదర్శన ఇవ్వనున్న తారలను ఎవ‌రు అనే విష‌యాలు తెలుసుకోవడానికి అభిమానులు ఉత్సుకతతో ఉన్నారు. గత సంవత్సరం నటులు రష్మిక మందన్న, తమన్నా భాటియా, అర్జిత్ సింగ్ గ్రాండ్ ఈవెంట్ ప్రారంభోత్సవంలో త‌మ సూప‌ర్బ్ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో మంత్రముగ్దులను చేశారు. ఈ సారి వేడుక‌లు బాలీవుడు నుంచి అనేక మంది ప్ర‌ముఖ తార‌లు రానున్న‌ట్టు ఐపీఎల్ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

Latest Videos

IPL 2024 : ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్.. ఇక దబిడిదిబిడే.. !

ఐపీఎల్ 2024 ప్రారంభ వేడుక‌లో ప్ర‌ద‌ర్శ‌లు ఇచ్చే తార‌లు ఎవ‌రు? 

ఐపీఎల్ ప్రారంభ వేడుక‌ల్లో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వ‌బోయే బాలీవుడ్ స్టార్ల వివ‌రాలను పంచుకుంది. ఐపీఎల్ 2024 ప్రారంభ వేడుకలో ప్రశంసలు పొందిన నేపథ్య గాయకులు ఏఆర్ రెహమాన్, సోనూ నిగమ్, నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లు ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వ‌నున్నారు.

ఐపీఎల్ 2024 ప్రారంభోత్సవ వేడుక ఎక్కడ జరుగుతుంది?

ఐపీఎల్ 2024 ప్రారంభ వేడుక చెన్నై వేదిక కానుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (చెపాక్) లో జరుగనుంది.

ఐపీఎల్ 2024 ప్రారంభ వేడుకలు ఎప్పుడు జరుగుతాయి?

ఐపీఎల్ 2024 ప్రారంభ వేడుక మార్చి 22న 17వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుందని స‌మాచారం.

ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ ఎప్పుడు, ఏ స‌మయానికి జ‌రుగుతుంది? 

ఐపీఎల్ 2024 ప్రారంభ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య మార్చి 22 న చెన్నైలోని ఎంఏ చిదంబరం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8:00 గంటలకు ప్రారంభం కానుంది. ఐపీఎల్ 17వ ఎడిషన్‌లోని మిగిలిన లీగ్ మ్యాచ్‌లు మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

ఐపీఎల్ 2024 ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడ‌వ‌చ్చు? 

క్రికెట్ ఔత్సాహికులు స్టార్ స్పోర్ట్స్ లో ఐపీఎల్ 2024 ప్రారంభ వేడుకతో పాటు ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ జియో టీవీలో అందుబాటులో ఉంటుంది.

ఐపీఎల్ లో బెస్ట్ బౌల‌ర్ ఎవ‌రు? ఐపీఎల్ చ‌రిత్ర‌లో బౌలింగ్ రికార్డులు ఇవే..

click me!