Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ లో బెస్ట్ బౌల‌ర్ ఎవ‌రు? ఐపీఎల్ చ‌రిత్ర‌లో బౌలింగ్ రికార్డులు ఇవే..

IPL Bowling Records: వికెట్ల పరంగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో టాప్ బౌలర్ యజువేంద్ర చాహల్. తన ఐపీఎల్ కెరీర్లో 153 మ్యాచ్ ల‌లో 187 వికెట్లు పడగొట్టాడు. 
 

Who is the best bowler in the IPL? These are the IPL Bowling Records RMA
Author
First Published Mar 20, 2024, 1:34 PM IST

Who is the best bowler in the IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ క్రికెట్ లీగ్‌లలో ఒకటి. 2008లో ప్రారంభమైనప్పటి నుండి ప్రేక్షకులను ఆకట్టుకుంటునే ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు సాగిన ఐపీఎల్ వివిధ సీజ‌న్ల‌లో బ్యాటింగ్, బౌలింగ్ లో అనేక రికార్డులు న‌మోద‌య్యాయి. ఇక మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024న 17వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

ఐపీఎల్ లో బ్యాటింగ్ తో పాటు అద్భుత‌మైన బౌలింగ్ రికార్డులు కూడా న‌మోద‌య్యాయి. పేస్-స్పిన్ మాయాజాలంతో ఒంటిచేత్తో మ్యాచ్ ల‌ను మ‌లుపుతిప్పిన సంద‌ర్భాలు ఉన్నాయి. సీజ‌న్ సీజ‌న్ కు కొత్త రికార్డులు న‌మోదు కావ‌డం, పాత రికార్డులు బ‌ద్ద‌లు కావ‌డం క‌నిపిస్తూనే ఉంది. క్రికెట్ ప్ర‌పంచానికి కొత్త బౌలింగ్ యువ స్టార్ల‌ను అందిస్తోంది. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు సాగిన ఐపీఎల్ లో బౌలింగ్ గ‌ణాంకాలు, రికార్డులు గ‌మ‌నిస్తే..

సూర్య‌కుమార్ యాద‌వ్ హార్ట్ బ్రేకింగ్ పోస్టు.. ఆందోళ‌న‌లో అభిమానులు.. ఐపీఎల్ నుంచి ఔటేనా?

ఐపీఎల్ బౌలింగ్ రికార్డులు (2023 సీజన్ వరకు)

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్ -య‌జ్వేంద్ర చాహల్

ఐపీఎల్‌లో అత్యధిక డాట్ బాల్స్ - భువనేశ్వర్ కుమార్ 

ఐపీఎల్ లో అత్యుత్తమ ఎకానమీ రేట్లు - అనిల్ కుంబ్లే

ఐపీఎల్ లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు - అల్జారీ జోసెఫ్

ఐపీఎల్‌లో అత్యధిక మెయిడెన్ ఓవర్లు - ప్రవీణ్ కుమార్

ఐపీఎల్ లో అత్యధిక హ్యాట్రిక్‌లు - అమిత్ మిశ్రా

ఐపీఎల్ చరిత్రలో నంబర్.1 బౌలర్ ఎవరు?

ఐపీఎల్ చరిత్రలో వికెట్లు తీసిన విషయానికొస్తే, యుజ్వేంద్ర చాహల్ టాప్ బౌలర్. అతను తన ఐపీఎల్ కెరీర్‌లో 153 మ్యాచ్‌లలో 187 వికెట్లు పడగొట్టాడు. ముంబ‌యి ఇండియ‌న్స్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల‌కు ఆడిన చాహ‌ల్ ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టీమ్ లో కొన‌సాగుతున్నాడు.

ఒక ఐపీఎల్ సీజ‌న్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ ఎవ‌రు? 

ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు డ్వేన్ బ్రావో పేరిట ఉంది. అత‌ను ఒక సీజ‌న్ లో 32 వికెట్లు తీసుకున్నాడు. హర్షల్ పటేల్ కూడా ఒక సీజన్‌లో ఈ ఘనత సాధించాడు.

IPL 2024 : ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్.. ఇక దబిడిదిబిడే.. !

Follow Us:
Download App:
  • android
  • ios