Ranji Trophy 2024: రంజీల్లో ఢిల్లీ క్రికెట్ చరిత్రలో ఓ చెత్త అధ్యాయాన్ని లిఖించింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు కొత్త జట్టు అయిన పుదుచ్చేరితో జరిగిన రంజీ ట్రోఫీ సీజన్ తొలి మ్యాచ్ లో సొంత మైదానంలో ఢిల్లీ తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఢిల్లీ కెప్టెన్ యశ్ ధుల్ హాట్ టాపిక్ గా మారారు.
Ranji Trophy 2024 - Yash Dhull: రంజీ ట్రోఫీ 2024 సీజన్ తొలి మ్యాచ్లో పుదుచ్చేరి చేతిలో మాజీ ఛాంపియన్ ఢిల్లీ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. మధ్యప్రదేశ్ మాజీ ఫాస్ట్ బౌలర్ గౌరవ్ యాదవ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 49 పరుగులిచ్చి కెరీర్ బెస్ట్ ఏడు వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఢిల్లీ ఓటమి తర్వాత ఆ జట్టు కెప్టెన్ యశ్ ధుల్ పేరు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఢిల్లీ టీమ్ మేనేజ్మెంట్ యశ్ ధుల్ ను కెప్టెన్సీ నుంచి తొలగించింది. అసలు అతన్ని కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించాల్సి వచ్చింది..?
రంజీ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్ లో పుదుచ్చేరి చేతిలో ఘోర పరాజయం చవిచూసిన కొద్ది గంటల్లోనే ఢిల్లీ కెప్టెన్ పదవి నుంచి యశ్ ధూల్ ను తొలగించారు. సీనియర్ బ్యాట్స్ మన్ హిమ్మత్ సింగ్ జనవరి 12 నుంచి జమ్ముకశ్మీర్ తో తలపడే ఢిల్లీ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఢిల్లీ అదృష్టాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో అండర్-19 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ధుల్ ను 2022 డిసెంబర్ లో ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా నియమించారు.
దమ్మున్న బౌలింగ్.. భారత పేస్ అటాక్ ప్రపంచంలోని ఏ జట్టుకైనా సవాలు విసురుతుంది: మహ్మద్ షమీ
2022 ఫిబ్రవరిలో అరంగేట్రం చేసిన యశ్ ధుల్ 43.88 సగటుతో 1185 పరుగులు చేశాడు. సొంతగడ్డపై పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్ లో ధూల్ తొలి ఇన్నింగ్స్ లో2, రెండో ఇన్నింగ్స్ లో 23 పరుగులు చేశాడు. ఈ సీజన్ ఆరంభంలో వైట్ బాల్ టోర్నమెంట్లలో కూడా జట్టుకు సారథ్యం వహించాడు. 'యశ్ ధుల్ ప్రతిభావంతుడైన ఆటగాడు, కానీ ఫామ్ లో లేడు. అతను బ్యాటర్ గా రాణించాలని మేము కోరుకున్నాము, అందుకే మేము అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుండి తొలగించాము. హిమ్మత్ మా సీనియర్ ఆటగాడు, మా కోసం చాలా బాగా ఆడాడు. అతను జట్టుకు సారథ్యం వహిస్తాడు' అని డీడీసీఏ సంయుక్త కార్యదర్శి రాజన్ మన్చందా తెలిపారు.
గత సీజన్లో ముంబైపై ఢిల్లీ ఘన విజయం సాధించింది. 2017లో అరంగేట్రం చేసిన ఈ 27 ఏళ్ల ఆటగాడు 22 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లను ఆడాడు. గతేడాది సీనియర్ ఆటగాళ్లు నితీశ్ రాణా, ధ్రువ్ షోరే ఢిల్లీని వీడి యూపీ, విదర్భకు వెళ్లారు. ఇంగ్లాండ్ లయన్స్ తో తలపడే భారత్-ఎ జట్టులో చోటు దక్కించుకున్న సీనియర్ పేసర్లు నవదీప్ సైనీ, ఇషాంత్ శర్మ జట్టుతో కలిసి జమ్మూకు వెళ్లడం లేదు. వెటరన్ పేసర్ ఇషాంత్ ఢిల్లీ హోమ్ మ్యాచ్ లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని సమాచారం. ఏడు సార్లు రంజీ ట్రోఫీ గెలిచిన ఢిల్లీ చివరిసారిగా 2007-08లో ట్రోఫీని గెలుచుకుంది. అలాంటి జట్టు పసికూన పుదుచ్చేరి చేతిలో ఓటమి హాట్ టాపిక్ అయింది.
నా జీవితంలో బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్.. అర్జున అవార్డుపై మహ్మద్ షమీ కామెంట్స్ వైరల్