India vs Afghanistan T20I Series: జనవరి 11 నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్ కోసం 19 మంది సభ్యులతో కూడిన జట్టును అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ప్రకటించింది. ఐపీఎల్ స్టార్ ప్లేయర్లు జట్టులో చోటుదక్కించుకున్నారు.
IND vs AFG T20I Series: జనవరి 11 నుంచి టీమిండియాతో జరిగే మూడు టీ20ల సిరీస్ కోసం 19 మంది సభ్యులతో కూడిన జాతీయ జట్టును ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ప్రకటించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వెన్ను శస్త్రచికిత్స తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇటీవల యూఏఈతో టీ20 సిరీస్ ను 2-1తో గెలిచిన ఇబ్రహీం జద్రాన్.. భారత్ తో జరిగే సిరీస్ లోనూ అఫ్గానిస్థాన్ కు నాయకత్వం వహించనుండగా, యూఏఈ సిరీస్ కు దూరమైన స్పిన్నర్ ముజీబ్ యువర్ రెహ్మాన్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. 2023 బిగ్ బాష్ లీగ్ లో వెన్నునొప్పికి శస్త్రచికిత్స చేయించుకున్న రషీద్ ఖాన్ కు జట్టులో చోటు దక్కింది. అయితే, తొలి మ్యాచ్ ఆడటం అనుమానమేనని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) తెలిపింది.
భారత్ తో మూడు టీ20ల సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు 19 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ప్రకటించింది. గురువారం మొహాలీలో తొలి మ్యాచ్ జరుగుతుందని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది.
TOP 10 SPORTS NEWS: టీ20 జట్టులోకి కోహ్లీ, రోహిత్.. డేవిడ్ వార్నర్ కొత్త అవతారం.. నాదల్ ఔట్
రషీద్ ఖాన్ ఆడటం అనుమానమే
ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ కు రెగ్యులర్ కెప్టెన్ గా ఉన్న రషీద్ ఖాన్ ను భారత్ తో జరిగే సిరీస్ కు ఎంపిక చేశారు. కానీ, కెప్టెన్సీ అతనికి ఇవ్వలేదు. వెన్నునొప్పికి శస్త్రచికిత్స చేయించుకోవడంతో తొలి మ్యాచ్ ఆడటం అనుమానమే. అందుకే యూఏఈతో షార్జాలో జరిగిన టీ20 సిరీస్ ను 2-1తో గెలిచిన ఇబ్రహీం జద్రాన్ భారత్ తో జరిగే సిరీస్ లోనూ జట్టుకు నాయకత్వం వహిస్తాడని ఏసీబీ డైరెక్టర్ మిర్వాయిజ్ అష్రఫ్ తెలిపారు. 'భారత పర్యటనలో తొలిసారి టీమిండియాతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడటం చాలా సంతోషంగా ఉంది. టీమిండియా ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ జట్టు అనీ, ఇటీవల బాగా రాణిస్తున్న తమ ఆటగాళ్లు భారత్ పై సవాలుతో కూడిన ప్రదర్శన చేస్తారని అష్రఫ్ అన్నాడు.
భారత్-ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ వివరాలు:
తొలి టీ20: జనవరి 11, మొహాలీ
రెండో టీ20: జనవరి 14, ఇండోర్
మూడో టీ20: జనవరి 17, బెంగళూరు
భారత్ తో టీ20 సిరీస్ కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు
ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహమానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహమత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మౌల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ హక్వాల్, ఎఫ్‌జీబ్ ఉర్ఖ్, ఎఫ్. ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీమ్, కైస్ అహ్మద్, గుల్బాదిన్ నాయబ్, రషీద్ ఖాన్.
వింటేజ్ రైడ్ లో రవీంద్ర జడేజా.. ఎద్దుల బండి నడుపుతున్న వీడియో వైరల్.. !