IPL 2024: కోల్‌కతా నైట్ రైడర్స్ కు బిగ్ షాక్.. !

By Mahesh Rajamoni  |  First Published Feb 21, 2024, 11:35 AM IST

IPL 2024 - KKR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ కు పెద్ద షాక్ తగిలింది. ఐపీఎల్ 2024 మార్చి 22 నుంచి ప్రారంభించ‌నున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.
 


Kolkata Knight Riders: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) కు రంగం సిద్ధ‌మ‌వుతోంది. 17వ సీజ‌న్ ఐపీఎల్ ప్రారంభం గురించి ఐపీఎల్ చీఫ్ అరుణ్ ధుమాల్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ సారి కూడా ఐపీఎల్ ను భార‌త్ లోనే నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. లోక్ స‌భ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్ ఉంటుంద‌ని తెలిపారు. నెల రోజుల పాటు సాగే ఐపీఎల్ కోసం తొలి 15 రోజుల షెడ్యూల్ ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌నీ, ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చిన త‌ర్వాత మిగ‌తా 15 రోజుల‌కు గేమ్ ప్లాన్ ను వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు.

దీంతో ఐపీఎల్ జ‌ట్లు ప్రాక్టిస్ ను  మ‌రింత వేగ‌వంతం చేశాయి. ఈ క్ర‌మంలోనే కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు బిగ్ షాక్ త‌గిలింది. కేకేఆర్ జ‌ట్టుకు స్టార్ ప్లేయ‌ర్ దూరం అయ్యాడు. ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు భారీ షాక్ త‌గిలింది. ఇంగ్లండ్ పేసర్ గుస్ అట్కిన్సన్ జట్టును వీడాడు.  అత‌ని స్థానంలో శ్రీలంక‌ ఆటగాడు దుష్మంత చమీర స్థానంలో కేకేఆర్ జట్టులోకి వచ్చినట్లు సమాచారం. దుష్మంత చమీర అద్భుత‌మైన బౌలింగ్ తో అక‌ట్టుకుంటున్నాడు. చమేరా 2018లో రాజస్థాన్ రాయల్స్, 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2022లో లక్నో సూపర్‌జెయింట్స్ తరఫున ఆడాడు.

Latest Videos

IPL 2024: రిషబ్ పంత్ వ‌చ్చేస్తున్నాడు.. ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ గా గ్రౌండ్ లోకి రీఎంట్రీ.. !

ఐపీఎల్ 2024 కోసం కేకేఆర్ జ‌ట్టు :

శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా (వైస్ కెప్టెన్), జాసన్ రాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకూ సింగ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, షకీబ్ అల్ హసన్, షకీబ్ అల్ హసన్ రూథర్‌ఫోర్డ్, ఆండ్రీ రస్సెల్, అనుకుల్ రాయ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమేర, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ, ముజీబ్ ఉర్ రెహమాన్.

విరాట్ కోహ్లీ కొడుకు పేరు 'అకాయ్' అంటే అర్థమేంటో తెలుసా?

click me!