IPL 2024: క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ ఎడిషన్ మార్చి 22న ప్రారంభం కానుంది. కారు ప్రమాదం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున గ్రౌండ్ లోకి దిగుతున్నాడు.
IPL 2024 - Rishabh Pant: క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ మళ్లీ బ్యాట్ పట్టాడు. ఐపీఎల్ 2024 సీజన్ తో గ్రౌండ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. దీని కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కర్ణాటకలోని ఆలూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్వహించిన ప్రాక్టీస్ గేమ్‌లో పాల్గొన్న రిషబ్ పంత్ ఐపీఎల్ 2024లో పునరాగమనానికి సిద్ధంగా ఉన్నాడు. డిసెంబర్ 2022లో ఘోరమైన కారు ప్రమాదానికి గురైన పంత్, ఆ తర్వాత క్రికెట్ కు దూరమయ్యాడు. ఏడాది కాలంకంటే ఎక్కువ సమయం క్రికెట్ ఆడ లేదు. మార్చి ద్వితీయార్ధంలో ఐపీఎల్ ప్రారంభమయ్యే ముందు మ్యాచ్ ఫిట్‌నెస్‌ను తిరిగి పొందడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు.
2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా, స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ గా రిషబ్ పంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. 2022 డిసెంబర్ లో జరిగిన ఘోర కారు ప్రమాదం తర్వాత పంత్ ఆటకు దూరమయ్యాడు. అప్పటి నుంచి పంత్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ సంఘంలో కోలుకుంటున్నాడు. వికెట్ కీపింగ్ బ్యాట్స్ మన్ తిరిగి ఫామ్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. రాబోయే ఐపీఎల్ లో పాల్గొంటాడని ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీ, హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ధృవీకరించారు కానీ, జట్టులో అతని పాత్రపై స్పష్టత ఇవ్వలేదు. అయితే, పంత్ క్యాపిటల్స్ కు సారథ్యం వహించి స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ గా ఆడతాడని సమాచారం.
IPL 2024: మార్చి 22న ఐపీఎల్-2024 ప్రారంభం.. తొలి మ్యాచ్ ఆ జట్ల మధ్యే.. !
పంత్ ఇటీవల బెంగళూరు సమీపంలోని ఆలూరులో జరిగిన వార్మప్ మ్యాచ్ లో పాల్గొన్నాడనీ, అక్కడ అతను ఫిట్ నెస్ లో చాలా పురోగతిని చూపించాడని పలు మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. 26 ఏళ్ల ఈ యంగ్ ప్లేయర్ చురుకుదనం, స్వేచ్ఛతో ముందుకు సాగుతూ ప్రాక్టిస్ కొనసాగిస్తున్నాడని తెలిపాయి. రిషబ్ పంత్ ఐపీఎల్లోకి పునరాగమనం గురించి మాట్లాడిన రికీ పాంటింగ్, ఇండియన్ స్టార్ ఐపీఎల్ లో ఆడటానికి చాలా ఆసక్తిగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని చెప్పాడు. రిషబ్ సరిగ్గా ఆడతాడని చాలా నమ్మకంగా ఉన్నాడని పాంటింగ్ చెప్పాడు. "ఏ హోదాలో ఉంటామో మాకు ఇంకా ఖచ్చితంగా తెలియదు. మీరు సోషల్ మీడియా విషయాలన్నీ చూసే ఉంటారు, అతను లేచి తిరుగుతున్నాడు. బాగా నడుస్తున్నాడు. అయితే తొలి మ్యాచ్ కు ఇంకా ఆరు వారాల సమయం మాత్రమే ఉంది.. కాబట్టి ఈ ఏడాది అతడి నుంచి వికెట్ కీపింగ్ వస్తుందో లేదో తెలియదు' అని అన్నాడు.
IPL 2024: మార్చి 22న ఐపీఎల్-2024 ప్రారంభం.. తొలి మ్యాచ్ ఆ జట్ల మధ్యే.. !