ఘోర పరాజయం... టాప్ ప్లేస్ కోల్పోయిన విరాట్ కోహ్లీ

By telugu news teamFirst Published Feb 27, 2020, 8:35 AM IST
Highlights

టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఇంతకాలం అగ్రస్థానంలో కొనసాగిన కోహ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. ఈ క్రమంలో 911 పాయింట్లతో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. 

న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.  తొలి టెస్టు ఓటమి ప్రభావం ఇప్పుడు ఆటగాళ్లు ర్యాంకులపై పడటం గమనార్హం. మరీ ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన మొదటి స్థానాన్ని కోల్పోయారు.

ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్సుల్లో కలిపి కేవలం 21 పరుగులే చేసిన.. టీమిండియా సారధి విరాట్ కోహ్లీ ర్యాంక్‌ పడిపోయింది. దీంతో టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఇంతకాలం అగ్రస్థానంలో కొనసాగిన కోహ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. ఈ క్రమంలో 911 పాయింట్లతో ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. 

Also Read తొలి టెస్టు ఓటమి... కోహ్లీ వైఫల్యమే కారణమంటున్న మంజ్రేకర్...

దీంతో స్మిత్ ఎనిమిదోసారి టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలిస్థానాన్ని  కైవసం చేసుకున్నట్లయింది. అయితే కోహ్లీకి, స్మిత్‌కు మధ్య కేవలం 5పాయింట్లే తేడా ఉండటం గమనార్హం. ఈ టాప్‌టెన్ టెస్ట్ బ్యాట్స్‌మెన్ జాబితాలో పదోస్థానంలో మయాంక్ అగర్వాల్ నిలిచాడు. తొలిసారి ఈ జాబితాలో అడుగుపెట్టడంపై మయాంక్ సంతోషం వ్యక్తంచేశాడు. 

మయాంక్‌తోపాటు జాబితాలో మరో ఇద్దరు భారత ఆటగాళ్లు అజింక్యా రహానే 8, చటేశ్వర్ పుజారా 9వ స్థానాల్లో నిలిచారు. అలాగే ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్సుల్లో కలిపి ఒక్క వికెటే తీసిన జస్ప్రీత్ బుమ్రా.. టెస్ట్ బౌలర్ల టాప్ 10 జాబితాలో స్థానం కోల్పోయాడు. 

ఈ పట్టికలో భారత్ నుంచి కేవలం రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే స్థానం సంపాదించాడు. తాజాగా విడుదలైన టెస్ట్ బౌలర్ల జాబితాలో అతను 9వ స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో మూడోస్థానంలో రవీంద్ర జడేజా, ఐదోస్థానంలో రవిచంద్రన్ అశ్విన్.. టాప్‌టెన్‌లో కొనసాగుతున్నారు. 

click me!