భారతీయ యువతితో ఆసిస్ క్రికెటర్ మ్యాక్స్ వెల్ ఎంగేజ్మెంట్

By telugu news teamFirst Published Feb 27, 2020, 7:53 AM IST
Highlights

మెల్‌బోర్న్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్న విని రామన్‌, మ్యాక్స్‌వెల్‌తో కలిసివున్న ఫొటోలు 2017లో సోషల్‌ మీడియాకు ఎక్కడంతో వీరి ప్రేమ వ్యవహారం వెలుగుచూసింది.  గతేడాది ఆస్ట్రేలియా క్రికెట్‌ అవార్డుల ప్రదానోత్సవానికి వీరిద్దరూ కలిసి రావడంతో సీరియస్‌గా ప్రేమించుకుంటున్నారని అర్థమయింది. 

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ త్వరలో పెళ్లికొడుకు కాబోతున్నాడు. భారత సంతతి యువతి విని రామన్‌ను అతడు పెళ్లాడనున్నాడు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా.. ఇటీవల తాను ప్రేమించిన ప్రేయసికి ఉంగరం తొడిగేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. దానికి  సంబంధించిన ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ సందర్భంగా కాబోయే భార్యతో దిగిన ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు. తన  గర్ల్‌ ఫ్రెండ్‌ వినీ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ చూపిస్తూ ఫొటోకు పోజునివ్వడం విశేషం.మ్యాక్స్‌వెల్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్‌ క్రిస్‌ లిన్‌ శుభాకాంక్షలు తెలిపాడు.

Also Read ఇండియన్ యువతి ప్రేమలో ఆసిస్ క్రికెటర్...

మెల్‌బోర్న్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్న విని రామన్‌, మ్యాక్స్‌వెల్‌తో కలిసివున్న ఫొటోలు 2017లో సోషల్‌ మీడియాకు ఎక్కడంతో వీరి ప్రేమ వ్యవహారం వెలుగుచూసింది.  గతేడాది ఆస్ట్రేలియా క్రికెట్‌ అవార్డుల ప్రదానోత్సవానికి వీరిద్దరూ కలిసి రావడంతో సీరియస్‌గా ప్రేమించుకుంటున్నారని అర్థమయింది. 

మ్యాక్సీ-విని తరచుగా ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తమ ప్రేమ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. మానసిక సమస్యలు కారణంగా కొంతకాల క్రికెట్‌కు విరామం ఇచ్చాడు. అయితే తాను మానసిక సమస్యలతో బాధ పడుతున్నట్టు మొదట గుర్తించింది విని రామనే అని మ్యాక్స్‌వెల్‌ అప్పట్లో వెల్లడించాడు. 

భారత సంతతి యువతిని పెళ్లాడిన ఆసీస్‌ రెండో క్రికెటర్‌గా అతడు నిలవనున్నాడు. ఆస్ట్రేలియా పేసర్‌ షాన్‌ టైట్‌.. మషూమ్‌ సింఘా అనే యువతిని ప్రేమించిన పెళ్లాడిన విషయం గుర్తుండే ఉంటుంది.

click me!