రోహిత్ తో చాహల్ టిక్ టాక్.... కడుపుబ్బా నవ్వాల్సిందే..!

Published : Feb 27, 2020, 08:17 AM IST
రోహిత్ తో చాహల్ టిక్ టాక్....  కడుపుబ్బా నవ్వాల్సిందే..!

సారాంశం

 ఓ బాలీవుడ్ సినిమా సీన్‌ని రీ క్రేయేట్ చేస్తూ టిక్ టాక్ వీడియో చేశాడు. ఇందులో చహల్ తన జాకెట్‌ను తికమక వేసుకొని కింద పడుకోగా రోహిత్, ఖలీల్ అతని స్నేహితుల్లా నటించారు. వారు చేసిన కామెడీ సీన్.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. 


టీమిండియా క్రికెటర్ చాహల్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటాడు. చాహల్ టీవీ అంటూ... మ్యాచ్ గెలిచిన ప్రతిసారీ హడావిడీ చేస్తుంటాడు. ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూ.. తాను సరదాగా ఉండటంతోపాటు.. తనతో ఉన్నవారిని కూడా సరదాగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాగా.. తాజాగా చాహల్ ఓ టిక్ టాక్ వీడియో చేశాడు. ఆ వీడియో నెటిజన్లను విపరీతంతగా ఆకట్టుకుంటుంది.

Also read అభిమానులకు పండగే... మార్చి 2న మైదానంలోకి ధోనీ..

న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగా చహల్‌ తన సహచర ఆటగాళ్లయిన రోహిత్‌ శర్మ, పేసర్ ఖలీల్ అహ్మద్ కలిసి ఈ టిక్ టాక్ వీడియో తీశాడు. కాగా ఆ వీడియోలో  ఓ బాలీవుడ్ సినిమా సీన్‌ని రీ క్రేయేట్ చేస్తూ టిక్ టాక్ వీడియో చేశాడు. ఇందులో చహల్ తన జాకెట్‌ను తికమక వేసుకొని కింద పడుకోగా రోహిత్, ఖలీల్ అతని స్నేహితుల్లా నటించారు. వారు చేసిన కామెడీ సీన్.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. 

 

 ఈ వీడియోను చహల్‌ 'వీ ఆర్ బ్యాక్' అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్ల నుంచి స్పందన కూడా హిలేరియస్ గా వస్తోంది. 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది