అతని బౌలింగ్‌ అంటే భయపడుతున్న కోహ్లీ: ఏకంగా 9 సార్లు ఔట్

By Siva KodatiFirst Published Feb 9, 2020, 3:30 PM IST
Highlights

ప్రస్తుత క్రికెట్‌లో రికార్డుల రారాజుగా వెలుగొందుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఫార్మాట్ ఏదైనా సరే మ్యాచ్‌కొక రికార్డును జేబులో వేసుకుంటున్నాడు. తను బద్ధలుకొట్టిన రికార్డులను తానే బద్ధలు కొట్టి సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తున్నాడు. అలాంటి కోహ్లీ ద్వారా కివీస్ బౌలర్ టీమ్ సౌతీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

ప్రస్తుత క్రికెట్‌లో రికార్డుల రారాజుగా వెలుగొందుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఫార్మాట్ ఏదైనా సరే మ్యాచ్‌కొక రికార్డును జేబులో వేసుకుంటున్నాడు. తను బద్ధలుకొట్టిన రికార్డులను తానే బద్ధలు కొట్టి సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తున్నాడు.

అలాంటి కోహ్లీ ద్వారా కివీస్ బౌలర్ టీమ్ సౌతీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీని ఎక్కువ సార్లు ఔట్ చేసిన బౌలర్‌గా టీమ్ సౌతీ రికార్డుల్లోకి ఎక్కాడు. అక్లాండ్‌లో జరిగిన రెండో వన్డే సందర్భంగా 15 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. సౌతీ వేసిన ఇన్ స్వింగర్‌ను ఆడటంతో తడబడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Also Read:నీ.. దూకుడు: అలా ఎలా కుదురుతుంది... ఫీల్డ్ అంపైర్‌తో విరాట్ కోహ్లీ గొడవ

సౌతీ బౌలింగ్‌లో ఆడేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న టీమిండియా కెప్టెన్ తద్వారా అన్ని ఫార్మాట్లలో కలిపి అతని బౌలింగ్‌లో తొమ్మిది సార్లు ఔటయ్యాడు. కాగా అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీని అత్యధికంగా ఔట్ చేసిన జాబితాలో ఇంగ్లాండ్ బౌలర్లు గ్రేమ్ స్వాన్, జేమ్స్ అండర్సన్ సంయుక్తంగా రెండో స్థానంలో వున్నారు. వీరిద్దరూ 8 సార్లు కోహ్లీని ఔట్ చేశారు. 

మరోవైపు న్యూజిలాండ్ టూర్‌లో విరాట్ కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శనను చూపించలేదు. తొలి టీ20లో 45 పరుగులు చేసిన కోహ్లీ ఆ తర్వాత వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. మళ్లీ తొలి వన్డేలో 51 పరుగులు చేసిన కోహ్లీ.. రెండో వన్డేలో 15 పరుగులకే పరిమితమయ్యాడు.

Also Read:కివీస్ పై సిరీస్ ఓటమి: విరాట్ కోహ్లీ ఓదార్పు మాటలు ఇవీ...

ఆక్లాండ్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 273 పరుగులు చేయగా... అనంతరం బరిలోకి దిగిన భారత్ 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టును విజయానికి దగ్గరగా తీసుకొచ్చినా.. కివీస్ బౌలర్ల ముందు నిలబడలేకపోయాడు. దీంతో న్యూజిలాండ్ 2-0 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. 

click me!