Virat Kohli - Harpreet Brar : పంజాబ్ కింగ్ స్పిన్నర్ పై విరాట్ కోహ్లీ కోప్పడ్డాడు. ఐపీఎల్ 2024 6వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కోహ్లీ 49 బంతుల్లో 77 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.
Virat Kohli - Harpreet Brar : ఐపీఎల్ 2024 లో 6వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 77 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మ్యాచ్ సమయంలో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్‌ను విరాట్ కోహ్లీ దుర్భాషలాడడం కనిపించింది. కోప్పడుతూ.. కొన్ని కామెంట్స్ చేయడం ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో దృశ్యాల్లో కనిపించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్ 13వ ఓవర్‌లో బౌలింగ్ చేయడానికి వచ్చాడు. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో నిలబడిన విరాట్ కోహ్లి, హర్‌ప్రీత్ బ్రార్‌ను ఆపి, ఆగు, ఊపిరి పీల్చుకోనివ్వండి అంటూ అనడంతో పాటు మరికొన్ని కామెంట్స్ అక్కడి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. పంజాబ్ కింగ్స్ తరఫున హర్‌ప్రీత్ బ్రార్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో 13 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.
Kohli to Brar: Ruka na pencho sans to lene de😭 pic.twitter.com/J1K5LWH0gd
— Breaking Bed 🚩 (@TheWalk_er)"రుక్ జా ప్****ఓ, సాన్స్ తో లెనే దే" అని విరాట్ కోహ్లి చెప్పడం వైరల్ అవుతున్న వీడియో దృశ్యాల్లో కనిపించింది. కాగా ఈ మ్యాచ్‌లో హర్‌ప్రీత్ బ్రార్ నాలుగు ఓవర్లలో కేవలం 13 పరుగులిచ్చి రెండు వికెట్లతో మెరిశాడు. అతను రజత్ పాటిదార్, మ్యాక్స్‌వెల్‌ల కీలక వికెట్లు తీశాడు. అయితే, చివరలో 10 బంతుల్లో 28 పరుగులతో అజేయంగా నిలిచిన దినేష్ కార్తీక్ ఉత్కంఠభరితంగా మ్యాచ్ ను ముగించి బెంగళూరుకు విజయాన్ని అందించాడు. ఆరంభంలో విరాట్ కోహ్లీ, చివరలో దినేష్ కార్తీక్ రాణించడంతో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో పంజాబ్ పై విజయం సాధించింది.
IND VS AUS : 3 దశాబ్దాల తర్వాత 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ ఇదిగో..