Border Gavaskar Test: భారత్, ఆస్ట్రేలియా జట్లు 1991-92లో చివరిసారిగా 5 మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ ఆడాయి. అయితే, రాబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను దృష్టిలో ఉంచుకుని 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ని నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది.
Border-Gavaskar Trophy Schedule : దిగ్గజ జట్ల మధ్య మరో బిగ్ ఫైట్ కు షెడ్యూల్ ఖరారు అయింది. భారత్-ఆస్ట్రేలియా జట్లు 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ కు షెడ్యూల్ ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఈ ఏడాది చివర్ లో బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్ షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. మూడు దశాబ్దాల తర్వాత భారత్-ఆస్ట్రేలియాలు 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనున్నాయి. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ నవంబర్ 22న పెర్త్‌లో ప్రారంభం కానుంది.
భారత్, ఆస్ట్రేలియా జట్లు 1991-92లో చివరిసారిగా 5 మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ ఆడాయి. ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా రెండు జట్లకు ప్రయోజనం చేకూర్చేలా రాబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను దృష్టిలో ఉంచుకుని 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే డబ్ల్యూటీసీ జాబితాలో టాప్ ప్లేస్ కోసం ఇరు జట్లు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టు పెర్త్‌లో జరగనుండగా, రెండో టెస్టు అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్టు జరగనుంది. దీని తర్వాత చివరి టెస్టు మ్యాచ్‌కు బ్రిస్బేన్, మెల్‌బోర్న్, సిడ్నీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టెస్టు సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభమై జనవరి 07, 2025 వరకు జరగనుంది.
undefined
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ :
1వ టెస్ట్ - నవంబర్ 22 నుండి 26 వరకు, పెర్త్.
2వ టెస్ట్ - 6 నుండి 10 డిసెంబర్, అడిలైడ్.
3వ టెస్ట్ - 14 నుండి 18 డిసెంబర్, గబ్బా.
4వ టెస్ట్ - డిసెంబర్ 26 నుండి 30 వరకు, ఎంసీజీ.
5వ టెస్ట్ - జనవరి 3 నుండి 7 వరకు, సిడ్నీ.
గతేడాది ఇంగ్లాండ్‌లోని ఓవల్ వేదికగా జరిగిన రెండో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్‌తో ఘోర పరాజయం పాలైన భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు సొంతగడ్డపై ఆస్ట్రేలియా జట్టుపై ప్రతీకారం తీర్చుకునేందుకు మరో అవకాశం వచ్చింది. మరోవైపు, భారత జట్టు 2017 నుండి స్వదేశంలో, విదేశాలలో బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లను కైవసం చేసుకుంటోంది.
CSK VS GT : ఐపీఎల్ విజేతలు.. ఇద్దరు కొత్త కెప్టెన్ల మధ్య ఫైట్ !