CSK vs GT : ఐపీఎల్ విజేతలు.. ఇద్ద‌రు కొత్త కెప్టెన్ల మ‌ధ్య ఫైట్ !

By Mahesh Rajamoni  |  First Published Mar 26, 2024, 6:19 PM IST

Chennai Super Kings vs Gujarat Titans : చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది. గుజ‌రాత్ టైటాన్స్ త‌న మొద‌టి సీజన్ లోనే ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుని చ‌రిత్ర సృష్టించింది. ఇరు జ‌ట్లు గ‌త ఐపీఎల్ లో ఫైన‌ల్ పోరులో పోటీ ప‌డ్డాయి. 
 


CSK vs GT : ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. ఇప్ప‌టికే జ‌రిగిన ఆరు మ్యాచ్ లు క్రికెట్ ల‌వ‌ర్స్ కు ఫుల్ ఎంట‌ర్ టైన్ మెంట్ ను అందించాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మంగ‌ళ‌వారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ 2008 నుంచి ఐపీఎల్ ఆడుతుండగా, గుజరాత్ టైటాన్స్ రెండేళ్ల క్రితం లీగ్ లోకి ఆడుగుపెట్టింది. ఐపీఎల్ ప్రారంభ సీజ‌న్ లోనే ఐపీఎల్ ఛాంపియ‌న్ గా నిలిచింది. రెండో సారి ఫైన‌ల్ కు చేరుకుంది. ఇక చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐదు టైటిళ్లు సాధించి ఐపీఎల్ లో విజ‌య‌వంత‌మైన జ‌ట్టుగా కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం ఇరు జట్ల బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ గట్టిగానే ఉంటుందని భావిస్తున్నారు. దీనికి తోడూ ఇరు జ‌ట్ల‌కు కొత్త కెప్టెన్లు రావ‌డంతో మ్యాచ్ పై మ‌రింత ఆస‌క్తిని పెంచింది. 

చెన్నై, గుజరాత్‌లో ఎవరిది పైచేయి..

Latest Videos

మంగ‌ళ‌వారం రాత్రి 8 గంటల నుంచి చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రెండు జట్లలో ఎవరిది పైచేయి అనే విష‌యాలు గ‌మ‌నిస్తే.. బ్యాటింగ్ విష‌యంలో చెన్నైలో రచిన్ రవీంద్ర, రితురాజ్ గైక్వాడ్, మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, అజింక్యా రహానే వంటి స్టార్ బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. ఇక‌ గుజరాత్‌లో శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, అజ్మతుల్లా ఒమర్జాయ్ వంటి ధ‌నాధ‌న్ ప్లేయ‌ర్లు ఉన్నారు. బౌలింగ్ ప‌రంగా కూడా ఇరు జ‌ట్లు బ‌లంగా ఉన్నాయి. 

ఐపీఎల్‌లో ఇరు జ‌ట్లు టైటిళ్ల‌ను సాధించాయి.. 

చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ రెండు జట్లు అద్భుతంగా ఉన్నాయి. విశేషమేమిటంటే ఐపీఎల్ టైటిల్ మ్యాచ్‌లో చెన్నై, గుజరాత్‌లు గెలిచాయి. చెన్నై అద్భుత ప్రదర్శన చేసి 2010, 2011, 2018, 2021, 2023లో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. 2022లో ఐపీఎల్ ట్రోఫీని గుజరాత్ టైటాన్స్ గెలుచుకుంది. కాగా 2023లో కూడా గుజరాత్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ ఫైన‌ల్ లో గుజ‌రాత్-చెన్నై టీమ్ లు త‌ల‌ప‌డ‌టం గ‌మ‌నార్హం.  

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 :

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), అజింక్యా రహానే, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రహ్మాన్, తుషార్.

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ 11 : 

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ ఖాన్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్, అర్సాయి కిషోర్.

ఆర్సీబీ గెలుపు త‌ర్వాత అనుష్క‌, వామికా, అకాయ్ ల‌తో కింగ్ కోహ్లీ వీడియో కాల్.. ఎంత క్యూట్ గా ఉందో.. !

click me!