న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన స్కోరు చూస్తే అయ్యో అనిపించకమానదు. రెండు టెస్టు మ్యాచుల్లోని నాలుగు ఇన్నింగ్సుల్లో అతను చేసిన మొత్తం స్కోరు 38 మాాత్రమే.
క్రైస్ట్ చర్చ్: న్యూజిలాండ్ పై రెండు టెస్టుల సిరీస్ ను భారత్ 0-2 స్కోరుతో ఓటమి పాలైంది. ఈ రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ చేసిన పరుగులు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రపంచ మేటి బ్యాట్స్ మన్ కు ఏమైందనే ఆశ్చర్యం కలగక మానదు.
టెస్టు మ్యాచుల్లో ఓడిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ మీడియా సమావేశంలో మాత్రం తన దూకుడును ప్రదర్శించాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను ఔట్ చేసిన తర్వాత అతను హేళన చేసిన తీరుపై ప్రశ్నించిన జర్నలిస్టుపై అతను తీవ్రంగా మండిపడ్డాడు.
undefined
Also Read: న్యూజిలాండ్ టూర్: సిరీస్ లకు దూరమైనా టాప్ స్కోరర్స్ వీళ్లే..
ఈ విషయంపై కేన్ విలియమ్సన్ ను ప్రశ్నించగా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరించాడు. అది విరాట్ టిపికల్ ప్రవర్తన, ఎంతో పాషన్ తో అతను క్రికెట్ ఆడుతాడని విలియమ్సన్ వ్యాఖ్యానించాడు.
విరాట్ కోహ్లీ నాలుగు ఇన్నింగ్సుల్లో కలిపి మొత్తం 38 పరుగులు మాత్రమే చేశాడు. తాను బాగున్నానని, తాను నిజంగా బాగా బ్యాటింగ్ చేస్తున్నానని, బయట ఉండి మాట్లాడేవారి మాటలను తాను పట్టించుకోనని విరాట్ కోహ్లీ రెండో టెస్టు ప్రారంభానికి ముందు అన్నాడు. స్కోరు కార్డులు బ్యాట్స్ మన్ ఫామ్ ను అన్ని వేళలా పట్టించవని క్రైస్ట్ చర్చ్ ఓటమి తర్వాత అన్నాడు.
Also Read: "టూ" అంటూ అరుపు: విరాట్ కోహ్లీకి అంపైర్ మొట్టికాయలు
న్యూజిలాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ మొత్తం 11 ఇన్నింగ్సు ఆడాడు. అతని బ్యాటింగ్ తీరు చెత్త నుంచి అతి చెత్తగా పరిణామం చెందుతూ వచ్చింది. మొత్తం 218 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలోనూ అతను చేసిన స్కోరు ఇదే.
విరాట్ కోహ్లీ 20 పరుగులు చేయకపోవడం టెస్టు సిరీస్ ల్లో ఇది రెండోసారి. న్యూజిలాండ్ పై జరిగిన టెస్టు సిరీస్ లో అనతు పరుసగా 2,19, 3, 14 పరుగులు చేశాడు.