Khushdil Shah: బే ఓవల్‌లో జరిగిన మూడో మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లు, అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఓటమి నేపథ్యం కామెంట్స్ చేయడంతో అభిమానులపై ఖుష్‌దిల్ షా దాడికి పాల్పడ్డాడు.
Khushdil Shah: పాకిస్థాన్-న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లోని చివరి మ్యాచ్ తర్వాత డ్రామా జరిగింది. బే ఓవల్‌లో జరిగిన మూడో మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లు, అభిమానుల మధ్య గొడవ జరిగింది. పాక్ ఆటగాడు ఖుష్‌దిల్ షా అభిమానులపైకి తిరగబడ్డాడు. మూడో వన్డేను కూడా న్యూజిలాండ్ గెలుచుకున్న తర్వాత ఇది జరిగింది.
న్యూజిలాండ్ పర్యటనలో ఓటమి కారణంగా ఖుష్‌దిల్‌ను స్టేడియంలో ఉన్న అభిమానులు ఎగతాళి చేశారు. దీంతో కోపానికి గురైన ఆటగాడు అభిమానుల దగ్గరకు వెళ్లి వారిపై దాడికి పాల్పడ్డాడు. సపోర్ట్ సిబ్బంది కలుగజేసుకోవడంతో పెద్ద గొడవ జరగకుండా ఆగింది. ఇంతకుముందు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాకిస్థాన్ 1-4 తేడాతో కోల్పోయింది. ఆ తర్వాత వన్డే సిరీస్‌లోనూ ఓడిపోయింది. పాకిస్తాన్ ప్లేయర్ ఫ్యాన్స్ పై దాడి చేసిన వీడియోలు వైరల్ గా మారాయి.
Khushdil Shah fighting fans after a 3-0 loss like
Hum haar gaye,lekin izzat toh bacha li verbal match jeet liya bhai
Pakistan team giving drama 😂😂
Pakistan team touring foreign countries just to complete tourism syllabus! pic.twitter.com/V6j2vTTIui
ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆటగాళ్లపై అభిమానులు అసభ్య పదజాలం ఉపయోగించడంతోనే సమస్యలు వచ్చాయని క్రికెట్ బోర్డు తెలిపింది. అఫ్గానిస్థాన్ అభిమానులను నిందిస్తూ బోర్డు ప్రకటన చేసింది.
"విదేశీ ప్రేక్షకులు పాకిస్థాన్ ఆటగాళ్లపై అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఖండిస్తోంది. మ్యాచ్ సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లపై అసభ్యకరమైన పదాలను ఉపయోగించారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసినప్పుడు ఖుష్‌దిల్ షా స్పందించాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్ అభిమానులు ఘోరమైన భాషలో దూషించారు. పాకిస్థాన్ జట్టు ఫిర్యాదు మేరకు స్టేడియంలోని అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదపుతు చేశారు" అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటనలో పేర్కొంది.