IND vs AUS: రింకూ సింగ్ అదిరిపోయే షాట్ .. నోరెళ్లబెట్టిన కెప్టెన్ సూర్య కుమార్.. వీడియో వైరల్

By Rajesh Karampoori  |  First Published Dec 2, 2023, 3:33 AM IST

 IND vs AUS 4th T20I: రాయ్‌పూర్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో యంగ్ బ్యాట్స్ మెన్ రింకూ సింగ్ సూపర్‌హిట్ షో చూపించాడు. ఈ బ్యాట్స్‌మెన్ తన తుఫాను బ్యాటింగ్‌తో అభిమానులను ఎంతగానో అలరించాడు. రింకు దూకుడుగా బ్యాటింగ్ చేసి విధ్వంసం స్రుష్టించారు. ఈ తరుణంలో అతడు కొట్టిన సిక్స్ ఓ షాక్ వైరల్ గా మారింది.


IND vs AUS 4th T20I: భార‌త్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన కీల‌క‌మైన నాలుగో మ్యాచ్ లో భార‌త్ అద్బుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. 5 మ్యాచ్ ల టి20 సీరీస్ లో రాయ‌చూర్ వేదిక‌గా జ‌రిగిన ఈ కీల‌క పోరులో 20 ప‌రుగుల తేడాతో భార‌త్ గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. ఈ నాలుగో టీ20 మ్యాచ్‌లో రింకూ సింగ్ సూపర్‌హిట్ షో చూపించాడు. యువ బ్యాట్స్‌మెన్ తన బ్యాటింగ్ లో తుఫాను స్రుష్టించాడు.

తన దూకుడు ఆట తీరుతో పరుగుల వరద పారించాడు. భారీ హిట్టింగ్స్ తో అభిమానులను అలరించాడు. కేవలం 29 బంతుల్లో 158 స్ట్రైక్ రేట్‌తో 46 పరుగులు చేశారు. ఈ ఇన్నింగ్స్‌లో రింకు ఆడిన షాట్‌ను చూసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఆశ్చర్యపోయాడు.  ఆయన కూడా ఓ అభిమానిగా మారి రింకూ బ్యాటింగ్ ను ఆస్వాధించారు. ఇప్పుడూ అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.  

Latest Videos

undefined

రింకూ సింగ్ స్విచ్ హిట్ వైరల్ 

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ పీకలోతు కష్టాల్లో పడింది. తొలి మూడు వికెట్లు ప్రారంభంలోనే కోల్పోయింది. దీంతో రింకూ సింగ్ బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ అయ్యాడు. ఇలా  గ్రౌండ్లో  అడుగుపెట్టిన రింకూ.. బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. టీమ్ మేనేజ్‌మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని వంచు చేయకుండా రాణించాడు. క్రీజులో అడుగు పెట్టిన వెంటనే.. భారీ షాట్‌లతో అదరగొట్టాడు. 12వ ఓవర్ లో మూడో బంతికి రింకూ అదిరిపోయే షాట్ కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

రింకూ ఈ షాట్‌ను లెప్ట్ హ్యాండ్ తో  కాకుండా రైట్‌ హ్యాండ్ తో ఆడారు. కుడివైపు ఆడుతూ షార్ట్ బాల్‌కు స్విప్ హిట్ కొట్టి సిక్స్ గా మలిచాడు. రింకూ బ్యాట్ నుంచి ఈ షాట్ ను చూసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఆశ్చర్యపోయాడు. నోరెళ్లబెట్టి అలా చూస్తూ ఉండిపోయారు. డగౌట్‌లో నిలబడి చప్పట్లు కొట్టాడు.

రింకూ సింగ్ మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఈ  యువ బ్యాట్స్‌మన్ కేవలం 29 బంతుల్లో 158 స్ట్రైక్ రేట్‌తో 46 పరుగులు చేశారు. ఇందులో 4 ఫోర్లు ,రెండు  సిక్స్ లు బాదాడు. ఈ తరుణంలో రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి రింకు నాలుగో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. దీని తర్వాత.. అతను ఐదో వికెట్‌కు జితేష్ శర్మతో కలిసి తుఫాను హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (37), రుతురాజ్ గైక్వాడ్ (32) పర్వాలేదని పించారు. దీని కారణంగా భారత జట్టు స్కోరు 173 పరుగులు చేరుకుంది.  

Kya baat h Rinku what a swipe shot🏏🫶 on 🔥 pic.twitter.com/25F0vU0Xvb

— Mahi Chowdhry (@Mahichowdhry07)
click me!