India Vs Australia 4th T20I: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ 20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో టీ 20 సిరీస్ భారత్ వశమైంది.
India Vs Australia 4th T20I: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ 20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా మ్యాచ్లో టీమిండియా దుమ్మురేపింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో విశ్వవిజేత ఆస్ట్రేలియా (Australia)ను కంగు తినిపించింది. ఏకంగా 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీ 20 సిరీస్(T20 Series)ను భారత వశమైంది.
భారత్,ఆ స్ట్రేలియా మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో టీమిండియా 20 పరుగుల తేడాతో నాలుగో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ విజయంతో సిరీస్‌లో టీమ్‌ఇండియా 3-1తో అజేయంగా నిలిచింది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. లక్ష్యచేధనలో కంగారూ జట్టు 154 పరుగులకే కుప్పకూలి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కోల్పోయింది.
టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. భారత్ తరఫున రింకూ సింగ్ అత్యధికంగా 46 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ 37 పరుగులు, జితేష్ శర్మ 35 పరుగులు చేశారు. రుతురాజ్ గైక్వాడ్ 32 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ డావ్రిస్ మూడు వికెట్లు తీయగా, తన్వీర్ సంఘా-జాసన్ బెహ్రెండార్ఫ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఆరోన్ హార్డీకి ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో టీమిండియా చివరి రెండు ఓవర్లలో 13 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ స్కోరు 200 పరుగులకు చేరువ కాలేదు.
ఆస్ట్రేలియా తరఫున కెప్టెన్ మాథ్యూ వేడ్ అత్యధికంగా అజేయంగా 36 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ 31 పరుగులు, మాథ్యూ షార్ట్ 22 పరుగులు అందించారు. బెన్ మెక్‌డెర్మాట్, టిమ్ డేవిడ్ చెరో 19 పరుగులు చేశారు. భారత్ విజయానికి స్పిన్ బౌలర్లు ఎక్కువ సహకారం అందించారు. ఆస్ట్రేలియా తొలి నాలుగు వికెట్లను భారత స్పిన్నర్లు తీశారు. అక్షర్ పటేల్ మూడు వికెట్లు, దీపక్ చాహర్ రెండు వికెట్లు తీశారు. రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్ చెరో వికెట్ తీశారు. అయితే భారత స్పిన్నర్లు చాలా పొదుపుగా బౌలింగ్ చేయడంతో అక్షర్-రవి కలిసి ఎనిమిది ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశారు.