India vs Australia, 4th T20I : తడబడిన భారత్, ఈసారి 200 లోపే .. ఆస్ట్రేలియా టార్గెట్ 175 పరుగులు

By Siva Kodati  |  First Published Dec 1, 2023, 9:32 PM IST

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాయ్‌పూర్‌లో జరిగిన నాలుగో టీ 20లో టీమిండియా.. ఆస్ట్రేలియాకు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ నిర్ణీత 20 ఓవర్‌లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో రింకూ సిగ్ (46), యశస్వి జైస్వాల్ (37), జితేష్ శర్మ (35), రుతురాజ్ గైక్వాడ్ (32)లు చేశారు. 


ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాయ్‌పూర్‌లో జరిగిన నాలుగో టీ 20లో టీమిండియా.. ఆస్ట్రేలియాకు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ నిర్ణీత 20 ఓవర్‌లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో రింకూ సిగ్ (46), యశస్వి జైస్వాల్ (37), జితేష్ శర్మ (35), రుతురాజ్ గైక్వాడ్ (32)లు చేశారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వారిషుస్ 3, బెహ్రెన్‌డాఫ్ , టీ సంగాలు 2, హార్డీ ఒక వికెట్ పడగొట్టారు. 

అంతకుముందు తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మ్యాథ్యూ వేడ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లు ఎప్పటిలాగే శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 50 పరుగల భాగస్వామ్యాన్ని అందించిన ఈ జంటను హార్డి విడదీశాడు. భారీ షాట్‌కు యత్నించిన యశస్వి మిడాన్‌లో మెక్ డార్మెట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే వెంట వెంటనే శ్రేయస్ అయ్యర్ (8), కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (1) వికెట్‌లను కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. దీంతో రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్‌లు  ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. 

Latest Videos

కుదురుకుంటున్న దశలో రుతురాజ్ గైక్వాడ్‌ .. సంఘా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి డ్వారిషుస్ చేతికి చిక్కాడు. అనంతరం జితేష్ శర్మ, రింకు సింగ్‌లు సంయమనంతో ఆడారు. ఐదో వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నిర్మించిన తర్వాత జితేష్ .. డ్వారిషుస్ వేసిన ఫుల్‌టాస్‌ను సిక్స్‌గా మలిచేందుకు ప్రయత్నించి బౌండరి లైన్ వద్ద ట్రావిడ్ హెడ్ చేతికి చిక్కాడు. తర్వాత వచ్చిన అక్షర్ పటేల్  (0), చాహర్ (0), రవి బిష్ణోయ్ (4), ఆవేశ్ ఖాన్ (1)లు విఫలమవ్వడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

click me!