నేను అప్పుడు చెప్పినట్లే ధోని ఇప్పుడు చేస్తున్నాడు: గౌతమ్ గంభీర్

By Arun Kumar PFirst Published Jul 26, 2019, 9:26 PM IST
Highlights

మహేంద్ర సింగ్  ధోని అంటే గిట్టనివారు సైతం ఇప్పుడు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇటీవలే యువరాజ్ ధోని గురించి ఫాజిటివ్ వ్యాఖ్యలు చేయగా తాజాగా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా అదేబాటలో నడిచాడు.     

మహేంద్ర సింగ్ ధోని అంటే గిట్టనివారంతా ఇప్పుడు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వారంతా ధోని విషయంలో అంత పాజిటివ్ గా మాట్లాడటానికి ఒకే ఒక కారణం ఇటీవల అతడు తీసుకున్న నిర్ణయమే. ఎంతోమంది భారత జట్టులో ఆడటానికి, సీనియర్లు సైతం జట్టులో చోటు దక్కించుకోడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ధోని అలాంటి అవకాశాన్ని తానే స్వయంగా వదులుకుని దేశ రక్షణ కోసం ఆర్మీ లో పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. అత్యంత క్లిష్టమైన పరిస్థితులు కలిగే కాశ్మీర్ లోయలో విధులు కేటాయించినా నిరభ్యంతరంగా అక్కడికి వెళ్లడానికి సిద్దపడ్డాడు. ఈ నిర్ణయంతో ధోని పేరెత్తితేనే విరుచుకుపడేవారు సైతం తాజాగా అతడిని ప్రశంసించడం ప్రారంభించారు.

మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ గతంలో ధోనిపై తీవ్రస్థాయిలో ద్వజమెత్తిన వ్యక్తి ఇటీవలే యూటర్న్ తీసుకున్నాడు. ధోని ఆటంటే తనకెంతో ఇష్టమని...అతడికి తాను పెద్ద అభిమానినంటూ తెలిపాడు. ఇక ఇప్పుడు భారత ఆర్మీలో చేరాలని ధోని తీసుకున్న నిర్ణయానికి తాను ఫిదా అయ్యానంటూ యోగరాజ్ ప్రశంసించాడు. తాజాగా  ఆయన తరహాలోనే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా ధోని గురించి మొదటిసారి ఫాజిటివ్ గా మాట్లాడాడు. 

దేశం కోసం ధోని తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదంటూ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. భారత సైన్యంలో చేరాలని వుందంటూ గతంలో ధోని తనతో చాలా సార్లు చెప్పాడని గంభీర్ గుర్తుచేసుకున్నాడు. అయితే నిజంగా నువ్వలా ఆర్మీతో గడపాలని అనుకుంటే అడపాదడపా వెళ్లిరావడం కాకుండా....ఎక్కువసమయం వారితో గడపాలని  చెప్పానని పేర్కోన్నాడు. ఇప్పుడు ధోని అలాగే చేస్తున్నాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

అతడు తీసుకున్న ఈ నిర్ణయంతో యువతలో భారత ఆర్మీ  పట్ల మరింత ఇష్టం పెరిగే అవకాశముందన్నాడు. ఇలా వారిని భారత సైన్యం వైపు నడిపించడంలో ధోని సఫలమయ్యాడు.  ప్రతి క్రీడాకారుడు భారత ఆర్మీ కోసం పనిచేస్తే యువతకు ఆదర్శవంతంగా మారతారని... ఆ విషయంలో వారంతా ధోనిని ఫాలో కావాలని గంభీర్ సూచించాడు. 

click me!