గ‌ల్లీ క్రికెట‌ర్ నుంచి స్టార్ ప్లేయ‌ర్ గా.. ఇప్పుడు డీఎస్పీగా దీప్తి శ‌ర్మ

By Mahesh RajamoniFirst Published Jan 30, 2024, 5:28 PM IST
Highlights

Deepti Sharma: టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ దీప్తి శర్మను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా గౌరవించింది. అలాగే, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా రూ. 3 కోట్ల నగదు బహుమతితో ప్ర‌భుత్వం స‌త్క‌రించింది.
 

Deepti Sharma honoured as DSP: భారత ఆల్ రౌండర్, స్టార్ ప్లేయ‌ర్ దీప్తి శర్మను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. 26 ఏళ్ల ఈ ఆల్ రౌండర్ జాతీయ జట్టులో నిలకడగా రాణిస్తూ క్లిష్ట పరిస్థితుల్లోనూ భార‌త్ కు చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాలు అందించాడు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆమెను సన్మానించి రూ.3 కోట్ల నగదు బహుమతితో సత్కరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

కాగా, దీప్తి విజయ ప్రయాణం ఆగ్రాలోని అవధ్ పూరి లోని సాధారణ పరిసరాలలో ప్రారంభమైంది.  అక్కడ ఆమె దీపక్ చాహర్ వంటి స్థానిక ప్రతిభావంతులతో కలిసి తన క్రికెట్ నైపుణ్యాలను మ‌రింత‌గా అభివృద్ధి చేసుకుంది. అద్భుత‌మైన ఆట తీరుతో దీప్తి శ‌ర్మ 2014లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆల్  రౌండ‌ర్ 194 మ్యాచ్ ల‌ను ఆడి 229 వికెట్లు పడగొట్టింది. 2018, 2022లో జరిగిన మహిళల ఆసియా కప్ లో అద్భుత‌మైన ఆట‌తో ప్ర‌శంస‌లు అందుకుంది.

Latest Videos

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అంద‌ర‌గొట్టిన దీప్తి శర్మ

చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో బంగారు పతకం, బర్మింగ్ హ‌మ్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో రజత పతకం సాధించింది దీప్తి శ‌ర్మ‌. డిసెంబర్ 2023 దీప్తి అసాధారణ ప్రదర్శన ఆమెకు ఐసీసీ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుతో స‌త్క‌రించింది. ఈ గౌరవాన్ని పొందిన రెండవ భారతీయ మహిళా క్రికెటర్ గా చ‌రిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో సంచలన విజయం సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. జార్జియా వేర్హామ్ తో కలిసి సిరీస్ లో సంయుక్తంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచింది.

 

Humbled by the Chief Minister of UP recognized for excellence in the Asian Games and my appointment as DSP in UP Police. Forever grateful. 🙏✨🧡 pic.twitter.com/G0TbtAfKnA

— Deepti Sharma (@Deepti_Sharma06)

UNDER 19 WORLD CUP: సెంచ‌రీతో చెల‌రేగిన టీమిండియా యంగ్​స్టర్ ముషీర్ ఖాన్.. 

click me!