ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అంద‌ర‌గొట్టిన దీప్తి శర్మ

By Mahesh Rajamoni  |  First Published Jan 30, 2024, 4:26 PM IST

ICC Rankings: ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్ లో భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ రెండో స్థానానికి ఎగబాకింది.అలాగే, ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ ఒక స్థానం ఎగ‌బాకి టాప్-10 లో చోటుద‌క్కించుకుంది.
 


ICC Rankings-Deepti Sharma: ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్ లో భారత స్టార్ ప్లేయ‌ర్, ఆల్ రౌండ‌ర్ దీప్తి శర్మ రెండో స్థానానికి ఎగబాకింది. పాకిస్థాన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ సాదియా ఇక్బాల్ తో కలిసి దీప్తి శర్మ సంయుక్తంగా రెండో స్థానానికి చేరుకుంది. ఐసీసీ మంగళవారం విడుదల చేసిన మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్ లో భారత క్రీడాకారిణి దీప్తి శర్మ ఒక స్థానం ఎగబాకి సంయుక్తంగా రెండో స్థానానికి చేరుకోగా, మ‌రో భార‌త బౌల‌ర్ రేణుకా సింగ్ కూడా ఒక స్థానం ఎగబాకి 10వ స్థానంలో నిలిచింది.

ఆస్ట్రేలియాతో జరిగిన రెండు మ్యాచ్ ల్లో ఒక వికెట్ తర్వాత దక్షిణాఫ్రికా స్పిన్నర్ నోంకులులేకో మ్లాబా మూడు స్థానాలు దిగజారి ఐదో స్థానానికి పడిపోవడమే దీప్తి పైకి చేరింది. అలాగే పాకిస్థాన్ క్రీడాకారిణి సాదియా ఇక్బాల్ ఒక స్థానం ఎగబాకి దీప్తితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ కు చెందిన సారా గ్లెన్ నాలుగో స్థానంలో నిలిచింది. బౌలర్ల టీ20 ర్యాంకింగ్స్ లో ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Latest Videos

మ‌రింతగా పెరిగిన భార‌త్ క‌ష్టాలు.. విశాఖ టెస్టులో ఇంగ్లాండ్‌కు ఎదురునిలిచేనా..?

అలాగే, ఆల్ రౌండర్ల తాజా టీ20 ర్యాంకింగ్స్ లో టాప్-10లో ఎలాంటి మార్పు లేకపోవడంతో దీప్తి నాలుగో స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక బ్యాటింగ్ లో భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన నాలుగో స్థానంలో నిలవగా, జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ వరుసగా 13, 16, 17 స్థానాల్లో నిలిచారు. ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ బెథానీ లూయిస్ మూనీ అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది.

మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్

1. సోఫీ ఎక్లెస్టోన్
2. దీప్తి శర్మ , 
3. సాదియా ఇక్బాల్
4.సారా గ్లెన్
5. నోంకులులేకో మ్లాబా

ఎవ‌రీ దీప్ గ్రేస్ ఎక్కా? ఒలింపిక్స్ ముందు భార‌త హాకీకి బిగ్ షాక్.. !

మహిళల టీ20 ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్

1. హెలీ మాథ్యుస్
2. అమేలియా కెర్
3. ఆష్లీ గార్డనర్
4. దీప్తి శర్మ 
5. నిదా దార్ 

విరాట్ జంపింగ్.. బుమ్రా బౌలింగ్ ! మ్యాచ్‌ని మలుపు తిప్పిన కింగ్ కోహ్లీ.. !

click me!