ధోని కాళ్లు మొక్కిన రుతురాజ్ కాబోయే భార్య.. వీడియో వైరల్

By Srinivas MFirst Published Jun 3, 2023, 11:37 AM IST
Highlights

IPL 2023:  సీఎస్కే ఓపెనింగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కు  ధోని మార్గదర్శకుడి కంటే ఎక్కువ. ఐపీఎల్ -16 ముగిసిన తర్వాత గైక్వాడ్..  తన కాబోయే భార్య ఉత్కర్ష పవార్ తో కలిసి.. 

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదో ట్రోఫీ అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంటే సీఎస్కే టీమ్ లో అందరికీ గౌరవం.  సీఎస్కే ఓపెనింగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కు  ధోని మార్గదర్శకుడి కంటే ఎక్కువ. ఐపీఎల్ -16 ముగిసిన తర్వాత గైక్వాడ్..  తన కాబోయే భార్య ఉత్కర్ష పవార్ తో కలిసి  ధోని దగ్గర  ఆశీర్వాదం తీసుకున్నాడు.   ఉత్కర్ష.. ధోని కాళ్లకు మొక్కిన వీడియో  నెట్టింట వైరల్ అవుతున్నది.  

చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య  కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఐపీఎల్ - 16 ఫైనల్లో  గెలిచిన తర్వాత  సీఎస్కే ఆటగాళ్లంతా తమ కుటుంబసభ్యులతో కలిసి ఈ ఆనంద క్షణాలను పంచుకున్నారు.  దాదాపు సీఎస్కేలో  పెళ్లి అయిన  క్రికెటర్ల భార్యలు  ఈ మ్యాచ్ ను లైవ్ లో వీక్షించారు. 

ఈ క్రమంలో రుతురాజ్ కూడా  ఉత్కర్ష పవార్‌తో కలిసి ధోని దగ్గరకు వెళ్లాడు.  ధోనిని పలకరించిన ఉత్కర్ష.. అతడిని హగ్ చేసుకుని  ఆ తర్వాత  తాలా ఆశీర్వాదం తీసుకునేందుకు గాను కాళ్లు మొక్కింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.  

 

Utkarsha (Mrs. Rutu) taking blessing of Dhoni 😍❤️💛. So Cute and Adorable🤌💕💞 pic.twitter.com/o5xH5RHMew

— Sai Vamshi Patlolla (@sai_vamshi21)

ఎవరీ ఉత్కర్ష పవార్..? 

పూణేకి చెందిన ఉత్కర్ష పవార్, మహారాష్ట్ర తరుపున దేశవాళీ టోర్నీలు ఆడుతుంది. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన ఉత్కర్ష, రైట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ చేస్తూ ఆల్‌రౌండర్‌గా రాణిస్తోంది. అక్టోబర్ 13, 1998లో పుట్టిన ఉత్కర్ష పవార్, 11 ఏళ్ల వయసు నుంచి క్రికెట్ ఆడుతోంది. పూణేలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫిట్‌నెస్ సైనెన్స్‌లో చదువుకుంటోంది. 2021 అక్టోబర్ 15న రుతురాజ్ గైక్వాడ్, ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచి అతి పిన్న వయసులో ఈ ఫీట్ సాధించిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేస్తే, ఆ తర్వాత సరిగ్గా నెల రోజులకు 2021, నవంబర్ 15న ఉత్కర్ష పవార్... ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఆఖరి మ్యాచ్ ఆడింది.  

ఐపీఎల్ - 16 ఫైనల్స్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి  నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది.  సాయి సుదర్శన్ 96 పరుగులతో రాణించాడు. వర్షం కారణంగా  చెన్నై ఇన్నింగ్స్‌ను  15 ఓవర్లకే కుదించిన అంపైర్లు.. ఆ జట్టు లక్ష్యాన్ని 171 పరుగులుగా నిర్దేశించారు. అయితే డెవాన్ కాన్వే (47), శివమ్ దూబే (32 నాటౌట్), గైక్వాడ్ (26),  అంబటి రాయుడు (19), అజింక్యా రహానే (27) లు  చెన్నైని విజయానికి చేరువ చేశారు. కానీ ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 13 పరుగులు కావాల్సి ఉండగా ఫస్ట్  నాలుగు బంతుల్లో మూడు పరుగులే  వచ్చాయి. మోహిత్ శర్మ  తన అనుభవన్నంతా ఉపయోగించి చెన్నైకి విజయాన్ని దూరం చేయడానికి ఫిక్స్ అయ్యాడు. కానీ ఐదో బంతిని జడ్డూ భారీ సిక్సర్ గా మలిచాడు. ఇక ఆఖరి బంతికి చెన్నై విజయానికి నాలుగు పరుగులు అవసరమనగా..  ఫైన్ లెగ్ దిశగా బౌండరీ బాదిన జడేజా  అశేష చెన్నై అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు. 

click me!