గల్లీ క్రికెట్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా చాహల్.. మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్ అంటూ.. డివిలియర్స్ కామెంట్స్

By Srinivas MFirst Published Jun 3, 2023, 10:34 AM IST
Highlights

చాహల్ ఇన్‌స్టాలో పోస్టు చేసిన వీడియో  నెట్టింట వైరల్ గా మారడంతో  నెటిజన్లతో పాటు ఐపీఎల్ లో తనతో ఆడిన సహచర క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు.  

ఐపీఎల్ -16 ముగిసిన తర్వాత  భారత టెస్టు జట్టులో లేని ఆటగాళ్లు  సేద తీరుతున్నారు. టీమిండియా  స్పిన్నర్  యుజ్వేంద్ర చాహల్ కూడా  ఎప్పటిలాగే తనదైన శైలిలో  సెలవులను ఎంజాయ్ చేస్తున్నాడు.  గల్లీ క్రికెట్ ఆడుతూ.. ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు ‘గల్లీ క్రికెట్ లో ఇంపాక్ట్ ప్లేయర్.. క్యా బోల్తీ’అంటూ  తన ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్‌ను ట్యాగ్ చేశాడు. 

చాహల్ ఇన్‌స్టాలో పోస్టు చేసిన వీడియో  నెట్టింట వైరల్ గా మారడంతో  నెటిజన్లతో పాటు ఐపీఎల్ లో తనతో ఆడిన సహచర క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు.  ఆర్సీబీలో చాలాకాలం చాహల్ తో కలిసి ఆడిన దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ స్పందిస్తూ.. ‘ఓపెనింగ్ బ్యాటర్’ అని కామెంట్ చేశాడు. 

అఫ్గానిస్తాన్ స్పిన్నర్, గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడే రషీద్ ఖాన్ కూడా ఈ వీడియోపై స్పందిస్తూ... ‘ఎట్లీస్ట్ ఇక్కడైనా సిక్స్  కొట్టు భాయ్’అని   ఫన్నీగా కామెంట్ చేశాడు. రషీద్ ఖాన్ కామెంట్ కు  యూజీ రిప్లై ఇస్తూ.. ‘రషీద్ నీకు ఇక్కడ రూల్స్ తెలియదనుకుంటా. ఇక్కడ సిక్స్ కొడితే అవుట్ అయినట్టే..’అని  కౌంటర్ ఇచ్చాడు. గల్లీ క్రికెట్ లో  రూల్స్ చాలా విచిత్రంగా ఉంటాయని  రషీద్ కు గుర్తు చేశాడు. 

 

చాహల్ భార్య  ధనశ్రీ వర్మ  కూడా ఈ వీడియోపై స్పందించింది. ‘వాట్ ఎ ఫన్ డే’ అంటూ  ఆమె కామెంట్ చేసింది. ఇక ప్రముఖ బాలీవుడ్ నటుడు అలి గొని స్పందిస్తూ.. ‘మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్’ అని  కామెంట్ చేశాడు. రాజస్తాన్ రాయల్స్  టీమ్ తో పాటు ఆ జట్టు బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కూడా  యుజీ  పోస్టుకు ఎమోజీలతో  స్పందించారు. ఇక మరికొందరు నెటిజన్లు.. ‘వచ్చే సీజన్ లో  973 రన్స్ రికార్డు (2016 ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ  చేసిన పరుగులు) ప్రమాదంలో ఉంది..’   అని కామెంట్ చేయగా మరికొంతమంది.. ‘పాన్ పరాగ్ (రియాన్ పరాగ్) కంటే నువ్వు చాలా బెటర్ అన్న..’అంటూ  స్పందిస్తున్నారు. 

2022లో  రాజస్తాన్ రాయల్స్ కు చేరిన  యూజీ.. ఈ ఏడాది ఐపీఎల్ లో  బ్రావో అత్యధిక వికెట్ల  (183) రికార్డును బ్రేక్ చేసిన విషయం తెలిసిందే.  ఈ సీజన్ లో చాహల్.. 14 మ్యాచ్ లలో  21 వికెట్లు పడగొట్టాడు. 

 

click me!