India vs Australia: 2023 వన్డే వరల్డ్ కప్ లో భారత్ ను ఆస్ట్రేలియా దెబ్బకొట్టింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా పరాభవానికి యంగ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందని భావించారు. కానీ, అండర్ 19 వరల్డ్ కప్ 2024 లో కూడా భారత్ ను ఆస్ట్రేలియా దెబ్బకొట్టింది.
Under 19 World Cup final: అండర్ 19 వరల్డ్ కప్ 2024లో తిరుగులేని విజయాలతో యంగ్ ఇండియా ఫైనల్ చేరుకుంది. మరోసారి భారత్-ఆస్ట్రేలియాలు ఫైనల్ పొరులో తలపడ్డాయి. అయితే, ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో భారత సీనియర్ జట్టును కంగారుల టీమ్ దెబ్బకొట్టింది. దానికి ప్రతీకారంగా యంగ్ ఇండియా అండర్-19 వరల్డ్ కప్ 2024లో ఆస్ట్రేలియాను దెబ్బతీస్తుందనీ, ప్రతీకారం తీర్చుకుంటుందని భావించారు. కానీ, మెగా టోర్నీలో అప్పటివరకు జైత్ర యాత్ర కొనసాగించిన భారత కుర్రాళ్లు ఫైనల్ లో చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా నిప్పులు చెరిగే బౌలింగ్ దెబ్బకు వరుసగా పెవిలియన్ బాటపట్టారు.
ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ లో ఆరుగురు భారత ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. ఇందులో ఇద్దరు ఒక్కపరుగు కూడా చేయకుండా పెవిలియన్ కు చేరారు. ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు రాణించడంతో 253 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ ఘోరంగా విఫలం అయింది. ఆస్ట్రేలియా అద్భుతమైన బౌలింగ్.. భారత యంగ్ ప్లేయర్లు కొన్ని చెత్త షాట్లు ఆడి వికెట్ల ముందు దొరికిపోయారు. రెండో ఓవర్ లోనే భారత్ కు షాక్ తగిలేలా అర్షిన్ కులకర్ణి ఔట్ అయ్యాడు. అప్పటి నుంచి భారత్ పతనం మొదలైంది. 25 ఓవర్లలోపూ 5 వికెట్లు కోల్పోయింది. భారత బ్యాటర్లలో ఆదర్శ్ సింగ్ 47, ముషీర్ ఖాన్ 22 పరుగులతో రాణించారు.
undefined
ఔట్ అయిన మిగతా ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే ఔట్ అయ్యారు. సెమీస్ వరకు పరుగుల వరద పారించిన కెప్టెన్ ఉదయ్ సహరాన్ 8 పరుగులకే ఔట్ అయ్యాడు. అర్షన్ కులకర్ణి 3, సచిన్ దాస్ 9, ఆరవెల్లి అవనీష్ డకౌట్, రాజ్ లింబాని డకౌట్ గా పెవిలియన్ చేరారు. మురుగన్ అభిషేక్ చివర్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ను (42 పరుగులు) ఆడాడు. కొద్ది సమయం ఆస్ట్రేలియాకు చెమటలు పట్టించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మహ్లీ బార్డ్‌మాన్ 3, రాఫ్ మాక్‌మిల్లన్ 3 వికెట్లు తీసుకుని భారత్ పతనాన్ని శాసించారు. కల్లమ్ విడ్లర్ 2, చార్లీ ఆండర్సన్ ఒక వికెట్ తీసుకున్నాడు. వరుసగా రెండు ఐసీసీ మెగా టోర్నీలలో భారత్ ను ఆస్ట్రేలియా దెబ్బకొట్టింది.