Under 19 World Cup final: బెనోని వేదికగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య అండర్-19 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా ఉంచిన 254 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తడబడుతోంది.
Australia-India final: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అండర్ 19 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్లు రాణించడంతో ఆస్ట్రేలియా 253 పరుగులు చేసింది. తక్కువ స్కోరే అయినప్పటికీ భారత్ టార్గెట్ ఛేదించడంతో తడబడుతోంది. ప్రస్తుతం ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. 25 ఓవర్లలోపూ 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం వికెట్లు కోల్పోయిన బ్యాటింగ్ చేస్తోంది. 134/8 (34.3 ఓవర్లు) పరుగులతో క్రీజులో మురుగన్ అభిషేక్, నమన్ తివారీలు క్రీజులో ఉన్నారు.
భారత బ్యాటర్లలో ఆదర్శ్ సింగ్ 47, ముషీర్ ఖాన్ 22 పరుగులతో రాణించారు. ఔట్ అయిన మిగతా ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే ఔట్ అయ్యారు. సెమీస్ వరకు పరుగుల వరద పారించిన కెప్టెన్ ఉదయ్ సహరాన్ 8 పరుగులకే ఔట్ అయ్యాడు. అర్షన్ కులకర్ణి 3, సచిన్ దాస్ 9, ఆరవెల్లి అవనీష్ డకౌట్, రాజ్ లింబాని డకౌట్ గా పెవిలియన్ చేరారు. ప్రస్తుతం మురుగన్ అభిషేక్ (22* పరుగులు), నమన్ తివారీలు క్రీజులో ఉన్నారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో మహ్లీ బార్డ్‌మాన్ 3, రాఫ్ మాక్‌మిల్లన్ 3 వికెట్లు తీసుకుని భారత్ ను దెబ్బకొట్టారు. కల్లమ్ విడ్లర్, చార్లీ ఆండర్సన్ చెరో ఒక వికెట్ తీసుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ లో ఆస్ట్రేలియా ప్లేయర్ బ్యా హ్యారీ డిక్సన్ 42 పరుగులు, హ్యూ వీబ్‌జెన్ 48, హర్జాస్ సింగ్ 55, ర్యాన్ హిక్స్ 20, ఆలివర్ పీక్ 46 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3 వికెట్లు, నమన్ తివారి 2 వికెట్లు తీసుకున్నారు. ముషీర్ ఖాన్, సౌమీ పాండేలు చెరో ఒక వికెట్ తీశారు.
భారత్ వికెట్ల పతనం:
3-1 ( అర్షిన్ కులకర్ణి , 2.2), 40-2 ( ముషీర్ ఖాన్ , 12.2), 55-3 ( ఉదయ్ సహారన్ , 16.5), 68-4 ( సచిన్ దాస్ , 19.1), 90-5 ( ప్రియాన్షు మోలియా , 24.5), 91-6 ( ఆరవెల్లి అవనీష్ , 25.3), 115-7 ( ఆదర్శ్ సింగ్ , 30.3), 122-8 ( రాజ్ లింబాని , 31.5)
జట్లు:
ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్(కెప్టెన్), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, ఆరవెల్లి అవనీష్(వికెట్ కీపర్), మురుగన్ అభిషేక్, రాజ్ లింబానీ, నమన్ తివారీ, సౌమీ పాండే.
ఆస్ట్రేలియా U19 (ప్లేయింగ్ XI): హ్యారీ డిక్సన్, సామ్ కాన్స్టాస్, హ్యూ వీబ్జెన్( కెప్టెన్), హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్(వికెట్ కీపర్), ఆలివర్ పీక్, రాఫ్ మాక్‌మిల్లన్, చార్లీ ఆండర్సన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్‌మన్, కల్లమ్ విడ్లర్.