India vs England: ఇంగ్లాండ్ కు బిగ్ షాక్.. భారత్ కు గుడ్ న్యూస్ !

By Mahesh Rajamoni  |  First Published Feb 11, 2024, 4:20 PM IST

India vs England: ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్ లు ముగిసిన త‌ర్వాత భార‌త్-ఆస్ట్రేలియాలు 1-1తో సమంగా ఉన్నాయి. హైద‌రాబాద్ టెస్టులో ఇంగ్లాండ్ గెల‌వ‌గా, విశాఖ టెస్టులో భార‌త్ విజ‌యం సాధించింది.
 


India vs England - Jack Leach: ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ కు బిగ్ షాక్ త‌గిలింది. బ్రిటీష్ టీమ్ లో అత్యంత అనుభవజ్ఞుడైన స్పిన్నర్ జాక్ లీచ్ భార‌త్-ఇంగ్లాండ్ సిరీస్ కు దూర‌మ‌య్యాడు. ఇప్ప‌టికే రెండు మ్యాచ్ లు ఆడిన ఈ సిరీస్ లో మిగిలిన మ్యాచ్ ల‌కు జాక్ లీచ్ దూర‌మ‌య్యాడు. దీంతో రెహాన్ అహ్మద్, షోయబ్ బషీర్, టామ్ హార్ట్లీలతో కూడిన అనుభవం లేని స్పిన్నర్లతో త్రీ లయన్స్ జట్టు భార‌త్ తో ఈ సిరీస్ లోని మిగ‌తా మూడు మ్యాచ్ ల‌ను ఆడ‌నుంది. జాక్ లీచ్ ఎడమ మోకాలి గాయం కారణంగా ఈ సిరీస్ కు దూరం అయ్యాడ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

లీచ్ తిరిగి ఇంగ్లాండ్ వెళ్తాడ‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. అక్క‌డ ఇంగ్లాండ్, సోమర్సెట్ వైద్య బృందాలతో కలిసి వైద్య ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండ‌నున్నాడు. జాక్ లీచ్ స్థానంలో మరొకరిని ఎంపిక చేయకూడదని ఇంగ్లాండ్ నిర్ణయించిందనీ, అందువల్ల జట్టులో ఉన్న స్పిన్నర్లతోనే సిరీస్ ను కొన‌సాగిస్తుంద‌ని స‌మాచారం. హైదరాబాద్ వేదికగా జ‌రిగిన తొలి టెస్టులో బౌండరీని అడ్డుకునే ప్రయత్నంలో జాక్ లీచ్ గాయపడ్డాడు. మరుసటి రోజు ఉదయం గాయం తీవ్రమవడంతో మొత్తం మ్యాచ్ లో 36 ఓవర్లు మాత్రమే ఆడగలిగాడు.

Latest Videos

undefined

Boxing: ఫైన‌ల్ కు చేరిన నిఖ‌త్ జ‌రీన్.. గోల్డ్ మెడ‌ల్ రేసులో ఆరుగులు భార‌త బాక్స‌ర్లు

ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఇంకా మూడు మ్యాచ్ ల‌ను భార‌త్-ఇంగ్లాండ్ ఆడ‌నున్నాయి. ఇప్ప‌టికే ఇరు జ‌ట్లు చెరో విజ‌యం సాధించ‌డంతో 1-1తో సమంగా నిలిచాయి. ఇప్పటి వరకు భారత జట్టుకు గట్టి పోటీ ఇచ్చిన ఇంగ్లాండ్ జట్టులోని స్పిన్నర్లకు ఫస్ట్ క్లాస్ స్థాయిలో మొత్తంగా 44 మ్యాచ్ ల‌ను ఆడిన అనుభ‌వం ఉంది. 22 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల‌ను ఆడిన టామ్ హార్ట్లీ ప్ర‌స్తుతం జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన స్పిన్నర్ గా ఉండ‌గా,  రెహాన్ (15 మ్యాచ్లు), బషీర్ (7 మ్యాచ్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే, ఇంగ్లాండ్ స్పిన్నర్లు పెద్ద‌గా అనుభ‌వం లేక‌పోయినా తమ చాకచక్యంతో సరిదిద్దుకుని భారత్ లోని పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటున్నారు. మూడో టెస్టు రాజ్ కోట్ లో జ‌ర‌గ‌నుంది.

భార‌త్ vs ఇంగ్లాండ్ టెస్టు జట్టు:

జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్, ఓలీ రాబిన్సన్, డేనియల్ లారెన్స్, గస్ అట్కిన్సన్.

IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్‌లోకి వెస్టిండీస్ యువ సంచ‌ల‌నం షమర్ జోసెఫ్ !

click me!