IND vs AFG U-19: మూడు దేశాల అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. నమన్ తివారీ అద్భుత ప్రదర్శనతో భారత అండర్-19 జట్టు 227 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
India vs Afghanistan U-19 : మూడు దేశాల అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు 227 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ గెలిచిన భారత్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. యువ బౌలర్ నమన్ తివారీ అద్భుతంగా రాణించి 7 ఓవర్లలో 11 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
సుమన్ తివారీ అద్భుతం..
లెఫ్టార్మ్ పేసర్ నమన్ తివారీ 4 వికెట్ల ప్రదర్శనతో అఫ్గానిస్థాన్ తో జరిగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. అఫ్గానిస్థాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అఫ్గానిస్థాన్ 33 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌటైంది. తివారీ 7 ఓవర్లలో 11 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, ప్రియాన్షూ మోలియాలు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
ఆదర్శ్ అజేయ అర్ధశతకం
నమన్ కు తోటి ఫాస్ట్ బౌలర్లు ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా నుంచి పూర్తి మద్దతు లభించింది. ధనుష్, ఆరాధ్య కూడా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆఫ్ స్పిన్నర్ ప్రియాన్షు మొలియాకు కూడా 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 39 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. తన ఇన్నింగ్స్ లో6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. దీంతో మరో 227 బంతులు మిగిలి ఉండగానే భారత్ ఘన విజయం సాధించింది.
తదుపరి మ్యాచ్ దక్షిణాఫ్రికాతోనే..
శనివారం భారత్ తన చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా అండర్ -19 జట్టుతో తలపడనుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్ లో భారత అండర్-19 జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వచ్చే బుధవారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
బయటపడుతున్న శివాజీ అసలు రంగులు, రైతు బిడ్డ పరువు తీసేలా కామెంట్స్!